Home సినిమా ఇక ఇప్పుడు మాల్యా బయోపిక్…హీరో…

ఇక ఇప్పుడు మాల్యా బయోపిక్…హీరో…

SHARE

బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగనామ౦ పెట్టిన సెలబ్రిటీ పై ఒక బయోపిక్ అంట. బ్రిటన్‌కి పారిపోయి తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితం తెరపై చూడబోతున్నాం.

మాల్యా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ బయోపిక్ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ ఈ బయోపిక్ బాధ్యత తీసుకున్నారు. సినిమాలో మాల్యాగా బాలీవుడ్ హీరో గోవింద కనిపించబోతున్నారు. అయితే పహ్లాజ్ ఈ సినిమాని పూర్తిగా వినోదాత్మకంగా తెరకిక్కిస్తారని తెలిసి౦ది.

ఈ బయోపిక్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు అయితే ఇప్పటికే గోవిందాతో ఒక పాటను కూడా తెరకెక్కించారు. సినిమాకు ‘రంగీలా రాజా’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. విచిత్రంగా దాదాపు 35 ఏళ్ల తర్వాత తిరిగి గోవిందా తెరపై కనపడుతున్నాడు.