Home రాజకీయాలు బాబు లెఖ్ఖ – ఒక్కో నియోజక వర్గానికి పాతిక కోట్లు

బాబు లెఖ్ఖ – ఒక్కో నియోజక వర్గానికి పాతిక కోట్లు

54
SHARE

రాబోయే ఎన్నికల కోసం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా సిద్ధంగా వున్నారని బహిష్కరణకు గురైన మాజీ మోత్కుపల్లి అన్నారు. అయితే బాబు లెఖ్ఖ ప్రకారం ఒక్కో నియోజకవర్గానికి పాతిక కోట్లు చొప్పున ఇప్పటికే పంపించి డబ్బు తరలించి ఉంచాడని మొత్కుపల్లి ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన పేదల వ్యతిరేక విధానమే బాబు పాలసి అన్నారు. అలాంటి పార్టీని ఓడగొట్టాలని ఏపీ ప్రజ లని తాను కోరుతున్నట్టు మోత్కుపల్లి

మోత్కుపల్లి మాటల్లో బాబు అక్రమ౦గా సంపాయించిన డబ్బునించి ప్రతి నియోజవకర్గానికి పాతిక కోట్లు ముందస్తుగా పంపాడు. బాబు వల్లే వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి; ఎన్నికల్లో బాబు ఖర్చు పెట్టేంత దేశంలోనే ఎవడూ ఖర్చు పెట్టలేడు. కేవలం ఎన్నికల వొస్తున్నప్పుడు మాత్రమే బాబుకి ఎన్టీఆర్‌ ఫొటోలు కావాలి….”

ఇక దేశంలో అన్ని కంపెనీలు దివాలా తీస్తుంటే హెరిటేజ్‌ మాత్రమే లాభాల్లో ఎలా నడుస్తోంది? దొంగ సొమ్ము ఫారిన్ దేశాలైన అమెరికా దుబాయ్ ల్లో దాస్తున్నారా లేదా…..ఇలాటి దొంగను ఆంధ్ర ప్రజలు ఈ సారి ఓడించాల్సిందే…..చంద్రబాబును నాశనం చేయమని ఆ ఏడుకొండలపై వున్న వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటా…..మోకాళ్ల పై తిరుమలకు మెట్లమీద నడుచుకుంటూ వెళతా…..నా ప్రాణాలు పోయినా పర్వాలేదు……దేవుడు నా మొర వింటే చాలు…..ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న బాబున బొందల పెట్టాల్సిందే….’’ అ౦టూ మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.