Home రాజకీయాలు అపరిచితుడు చంద్రబాబు

అపరిచితుడు చంద్రబాబు

SHARE

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిస్థితి అపరిచితుడు లా తయారైందని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

నాయుడు ప్రతి విషయంలో అబద్దాలు, ఒక దానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతూ అపరిచితుడు లా అయ్యారని కన్నా మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితుల వైపు మాట్లాడుతూ వారి ఉసురు బాబుకు ఖచ్చితంగా తగిలి తీరుతుందని అన్నారు. బాబు సొంత జిల్లా అయిన చిత్తూర్ లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆస్తులు భయంకరంగా అన్యాక్రాంతం అవుతుంటే చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు.

ప్రశ్నిస్తోన్న ప్రతీవారిపై పోలీసుల ఝులుమ్ చూపిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. అమిత్‌ షాపై దాడి అదేనని వ్యాఖ్యానించారు!!