Home రాజకీయాలు బాబూ నీ రిటైర్మెంట్ పిలుస్తోంది…!!

బాబూ నీ రిటైర్మెంట్ పిలుస్తోంది…!!

SHARE

జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి రిటైర్మెంట్ టైం దగ్గర పడిందంటూ అన్నారు.

తిరుమల వ్యవహారం పై స్పందిస్తూ తెదేపా ప్రభుత్వ వైఫల్యాలు పవన్ ఎండగట్టారు. ప్రజలకు కనీస అవసరాలైన నీరు ని కూడా అందించడంలో, నిధుల కేటాయింపు మరియు యువతకి ఉద్యోగాల విషయాల్లో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది అన్నారు. చంద్రబాబు రమణ దీక్షితులు రిటైర్మెంట్ వయసు అడిగినందుకు పవన్ చంద్రబాబు రిటైర్మెంట్ వయసు వచ్చిందని జ్ఞాపకం చేసి ప్రజలు త్వరలోనే బాబు ని ఇంటికి పంపిస్తారని అన్నారు.

జన సేన పవర్ లోకి వచ్చిన తర్వాత తెదేపా తీరు తప్పులు స్కామ్లు అన్ని ఎండగడతామని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టు జన సేనాని తాను అధికారంలోకి వచ్చాకా అంటూ మాట్లాడుతున్నారు…జగన్ ముఖ్యమంత్రి అంటే ఓ కోపం తో ఊగిపోయే జన సేనాని ఎక్కడబ్బా…??