Home రాజకీయాలు బాబుకొడుకుల అతి కబుర్లు బాబోయ్…!

బాబుకొడుకుల అతి కబుర్లు బాబోయ్…!

76
SHARE

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… అతి కబుర్లు చెప్పడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి. ఏపీలో, ఇండియాలో ఏమిజరిగినా, ఏ అద్భుతం జరిగినా, ఎక్కడ మంచి జరిగినా… ఆఖరికి సింధూకి పథకం వచ్చినా కూడా అది తన క్రెడిట్టే అని చెప్పుకునే పరిస్థితికి వెళ్లిపోయారు చంద్రబాబు. అది కాస్త చెడింది అనుకోండి.. తనకూ దానీకి ఏమీ సంబందం లేదని కూడా వెంటనే ప్లేట్ ఫిరాయించే నైపుణ్యం కూడా బాబు సొంతం. దీనికి తాజా ఉదాహరణ పాత నోట్ల రద్దు వ్యవహారం. మొన్న వద్దన్న హోదా ఇప్పుడు కావాలనడం.. తెలంగాణ ఇవ్వమని లేఖ ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించింది అని బొంకడం. ఈ విషయంలో అతి కబుర్లు చెప్పడంలో తండ్రికంటే ఆరాకులు ఎక్కువ చదివే పనికి పూనుకున్నారు లోకేష్!

తాజాగా మహానాడులో మైకందుకున్న నారా లోకేష్… తనదైన స్టైల్లో ప్రసగించారు. రాష్ట్రం ముందుకు పోతుందని, అభివృద్ధి మామూలుగా లేదని, తన దృష్టిలో వైకాపా తనకు అసలు పోటీనే కాదని, ప్రతిపక్షంగా తాను వైకాపాను గుర్తించడం లేదని… తన అజ్ఞానాన్ని బయటపెడుతూ, సెల్ఫ్ డబ్బాలు వేసుకుంటూ ప్రసగించుకుంటూ పోయారు. ఈ క్రమంలో లోకేష్ నోటి నుంచి మరో అద్భుతమైన సెల్ఫ్ ఒకటి జాలువారింది. అదేమిటయ్యా అంటే… పల్లెకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు అన్నారని… తాను పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పల్లెలకు సేవ చేస్తున్నానని. అంతేనా… స్వాతంత్రం వచ్చినప్పటినుంచి… అంటూ మరో మాట మాట్లాడారు లోకేష్.

స్వాతంత్రం వచ్చిన తరువాత 70 ఏళ్లలో ఎవరూ, ఎప్పుడూ చేయలేని పనులన్నీ గడిచిన 4ఏళ్లలో పూర్తిచేశామని లోకేష్ బాబు చెప్పుకొచ్చారు. తాము వేసిన సీసీ రోడ్ల మీద ప్రతిపక్ష నాయకులు నడుస్తున్నారని చెప్పుకున్నారు. అంటే… సీసీ రోడ్లు వేసినంత మాత్రాన్న పల్లెలు అభివృద్ధి చెందినట్లేనా? పల్లెలంటే రోడ్లు కాదు.. ప్రజలు, వారి జీవనశైలిలో మార్పులు, రైతులకు భరోసా కల్పించే ఆలోచనలు, నిరుద్యోగులకు ఆసరా, మహిళలకు రక్షణ… ఇవన్నీ చినబాబు మరిచిపోవడం దురదృష్టం! స్వాతంత్రం వచ్చిన 70ఏళ్ల వరకూ జరిగిన అభివృద్ధి ఒకెత్తు… ఈ నాలుగేళ్లలో తాను పంచాయతీ శాఖా మంత్రిగా ఉండగా జరిగిన అభివృద్ధి ఒకెత్తు అనే రేంజ్ లో మాటలు చూశాక…. సెల్ఫ్ డబ్బాలు, అతి కబుర్లు చెప్పడంలో లోకేష్ బాబు.. తన బాబునే మించిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి!! ఎవరు ఎంత సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నా, ఎన్ని అతికబుర్లు చెప్పుకున్నా.. వాస్తవాలు ప్రజలకు ఎరుకే కదా!!