Home రాజకీయాలు పంచాయతీ ఎన్నికల ప్రచారానికి కోహ్లీ??

పంచాయతీ ఎన్నికల ప్రచారానికి కోహ్లీ??

73
SHARE

రాజకీయ నాయకులు అంటే బూటకపు హామీలకు పర్యాయపద౦ అనే నానుడి మరోసారి ఋజువు చేసిందీ ఘటన. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నఓ వ్యక్తి తానూ నిర్వహించే ర్యాలీకి టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ వస్తాడని జనాలకు ఓ ప్రామిస్ చేసేశాడు. ఇంకేముంది ఊళోవాళ్లంతా కోహ్లీ ఎప్పుడొస్తాడా అనీ చెమటలు తుడుచుకుంటూ ప్రత్యర్థులు ఉన్నారు. ఊళ్ళో జనాలు కోహ్లీతో సెల్ఫీల కోసం స్మార్ట్ ఫోన్లతో వెయిటింగ్. కోహ్లీని ఆహ్వానిస్తూ బ్యానర్లు కూడా కట్టారు.

ఇక డీ డే న కోహ్లీని చూడాలని ఉత్సాహంగా బయలుదేరారు. కోహ్లీ వచ్చాడు కూడా. కొందరు అతడితో సెల్ఫీలు , కొందరు క్రికెటర్తీ తో మాటలు కలిపారు. ఇంకొంతమంది పాపం మెడనొప్పి వున్నా ప్రచారానికి వచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు…అంతా హాడావుడీ చేశారు.

కొంత మందికి మాత్ర౦ ఎక్కడో తేడా కొట్టింది. అతడు డూప్లికేట్ కోహ్లీ అనే అనుమాన౦ వచ్చింది. ఓ అభిమాని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. నిమిషాల్లో వైరల్ అయి౦ది. నిజం బయటకొచ్చింది.

కోహ్లీ పేరుతో జనాల్ని ఫూల్స్ చేసిన నేతను రెచ్చిపోయి ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. మహారాష్ట్రలోని రామ్‌లింగా పంచాయతీ ఎన్నికల్లో ఈ సంఘటన jచోటుచేసుకుంది. సర్పంచ్‌గా బరిలోకి దిగిన విఠల్ కోహ్లీ హామీ ఇచ్చాడు.

అంతే కదా బూటకపు హామీలతో ఎన్నాళ్ళు పబ్బం గడుపుకోగలరు ఎవరైనా?