Home రాజకీయాలు ఇంటికెళ్లినప్పుడు ఈ జ్ఞానం ఏమైంది బాబు!

ఇంటికెళ్లినప్పుడు ఈ జ్ఞానం ఏమైంది బాబు!

61
SHARE

ఏరు దాటాక తెప్ప తేలేయడంలో చంద్రబాబుకు మించిన వారు ఉండరనే అనుకోవాలి. అంత దారుణంగా, అంత అనైతికంగా ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడగలుగుతారో బాబుకే తెలియాలి. విశ్వసనీయత వంటి పెద్ద పెద్ద పదాలు బాబుకు ఆపాదించలేకపోయినా… కనీసం విశ్వాసం, కృతజ్ఞత, విలువలు వంటివి సైతం బాబు ఎప్పుడో పక్కన పెట్టేశారు. కుర్చీ ఎలా ఎక్కామన్నది ముఖ్యం కాదు.. ఎక్కామా లేదా.. అధికారమే పరమావధి.. అన్నట్లుగా బాబు ముందుకుపోతున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పై పైన చెప్పుకున్న అన్ని విషయాలను వదిలి ఫైరయ్యారు చంద్రబాబు!

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లు కలిసి.. పవన్ గడప తొక్కి సాయం అడిగిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం, సినిమా ప్రభావం కాస్త ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ పవన్ సాయాని మరింఅ ఎక్కువగా కోరారు చంద్రబాబు! దీంతో అప్పట్లో బాబుకు అన్నీ అలా కలిసి రావడంతో.. గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయగలిగింది టీడీపీ – బీజేపీ టీం! ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఎన్నికల అనంతరం కుర్చీ ఎక్కిన చంద్రబాబు సైతం… పవన్ కు కొంతకాలం పాటు అనధికారికంగా భరీ గౌరవాలు ఇస్తున్నట్లు కనిపించేవారు. అయితే తాజాగా బాబు అసలు రంగు మరోసారి బయటపడింది.

తాజాగా మహానాడులో బాబు మాట్లాడిన చంద్రబాబు… పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారని, ఆయన పోటీ చేస్తే.. ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకు ఓట్లు వేసే వారు ఒక్కశాతం కూడా లేరంటూ ఎద్దేవా చేశారు. కాసేపు ఇదే నిజం అనుకుంటే… 2014లో పవన్ ఇంటికి వెళ్లి మరీ తనకు సాయంగా ఉండాలని.. తమ కూటమిలో చేరాలని ఎందుకు అడుగుతారు? ఇది కాస్త ఇంగితం ఉన్నవారెవరికైనా వచ్చే ఆలోచనే! కాకపోతే… చంద్రబాబు అలాంటి విషయాలేమీ పెద్దగా పట్టించుకోరు కాబట్టి… మరీ దారుణంగా… పవన్ కు ఒక్కశాతం ఓట్లు కూడా రావనడం బాబు రాజనీతికి చిహ్నం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోపక్క… బాబు మాటలపై పవన్ ఫ్యాన్స్ అంతెత్తున లేచిపడుతున్నారు.