Home రాజకీయాలు ఆడపడుచులకు రక్షణ లేదు

ఆడపడుచులకు రక్షణ లేదు

SHARE

మాట‌లు వినీ.. వినీ..మోస‌పోయాం.. ఇక కావాల్సింది మార్పే. తెలుగుదేశం పార్టీ పాలనలో ఆడపడుచులకు రక్షణ లేకుండా పోయిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. శ్రీకాకుళంలో ప్రజా పోరాట యాత్ర సాగిస్తున్న ఆయన ఆదివారం నరసన్నపేట కళాసీ సంఘం భవనంలో జరిగిన సభలో ప్రసంగించారు. గత ఎన్నికల్లో తన మద్దతు కోరిన టీడీపీ ఇప్పుడు తన సభలకు కరెంటు కట్‌ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఆడపడుచులపై దాడులు పెరిగాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

వారసత్వ, కుటుంబ రాజకీయాలు చేస్తూ టీడీపీ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోందని చెప్పారు. ఉర్లాం రైల్వేస్టేషన్‌లో ఒక్క ఎక్స్‌ప్రెస్‌ రైలు అయినా నిలవడం లేదంటే ఈ పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. బుడితి ఇత్తడి పని కార్మికులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఎన్నిమార్లు ప్రజా సమస్యలు వివరించినా ఫలితం లేకుండాపోయిందన్నారు.

శ్రీకాకుళం నుంచి నేరుగా నరసన్నపేట వచ్చిన పవన్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి జట్టు కళాసీ సంఘం భవన ప్రాంగణం వరకు కార్యకర్తలతో నడిచి అనంతరం సభలో ప్రసంగించారు.