Home రాజకీయాలు నిధులు ఎగ్గొట్టే౦దుకే యూసీ ల నాటక౦: యనమల

నిధులు ఎగ్గొట్టే౦దుకే యూసీ ల నాటక౦: యనమల

66
SHARE

యూసీలు కేంద్రానికి సమర్పించడంలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎప్పటికప్పుడు యూసీలు అందిస్తు౦టే యూసీలు ఇవ్వడంలేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించడం దారుణమని ఆర్థిక మంత్రి అన్నారు. ఇది ఎంత మాత్రం అవగాహన లేకుండా అమిత్ షా మాట్లాడటమే అని యనమల అన్నారు.

కేవలం రాష్ట్రానికి నిధులను ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ఇది కేంద్రం ఆడుతున్న కొత్త నాటక౦ అని యనమల ఆరోపించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఏపీకి ఇంత వరకు కేంద్రప్రభుత్వం నయా పైసా నిధులు రాలేదని మండిపడ్డారు. ఇది కుట్రపూరితమే అని, కావాలనే ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర౦ తీరు ఆక్షేపణీయం అన్నారు. ఈ తీరు ఏపీ అభివృద్ధిని కాలరాసేలా ఉందని చెప్పారు.