Home రాజకీయాలు మహానాడు సభలో లోకేష్ విచిత్ర వ్యాఖ్యలు…!!

మహానాడు సభలో లోకేష్ విచిత్ర వ్యాఖ్యలు…!!

74
SHARE

మహానాడు లో ఏ పీ ఐటీ శాఖామాత్యులు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ప్రసంగించారు. వచ్చిన ప్రజలని చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయిన లోకేష్; కనుచూపు మేర లో ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చినందుకు సంతోషం ప్రకటించారు.

పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఏపిలో 2019లో బిజెపికి ఒక్కటంటే ఒక్క శాతం ఓట్లు కూడా పడవని ఘంటాపధంగా చెప్తే లోకేష్ గారు మాత్రం ప్రతిపక్ష వైకాపా అసలు తమకు ప్రతిపక్షమే కాదని అసలు ఎన్నికలలో తమకి ఏ మాత్రం పోటీ కాదని వైకాపా కి అసలంత సీన్ లేదని అంటూ తమ ప్రదాన ప్రత్యర్ది భారతీయ జనతా పార్టీ అన్నారు. ఏపీ కి కూడా భారతీయ జనతా పార్టీ నే ప్రధాన శత్రువు అన్నారు. జనాలు వై కాపా కి ఓటు వేస్తే భాజపా కి వేసినట్టే అన్నారు. వైసీపీకి బీజేపీ ఆక్సిజన్.. కేసుల మాఫీ కోసం జగన్ పాట్లు అంటూ చెప్పుకొచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐసియు లో ఉందని లోకేష్ అన్నారు. మహానాడులో ఆయన ప్రసంగిస్తూ భాజపా తాను సొంతగా ఏమీ చేయలేక కొత్త నటులను, కుల సంఘాలను రంగంలోకి దించుతోందని ఆరోపించారు. లోకేష్ప్ర ప్రసంగం పై నెట్టింట ఒకటే జోకులు – ప్ర ధాన ప్రత్యర్థి అంటే అసలు అర్ధం తెలుసో లేదో అమాత్యులవారికి అంటూ…!!