Home రాజకీయాలు రేపో మాపో జగన్ ని కూడా బాబు ఆలింగనం చేసుకుంటారు!

రేపో మాపో జగన్ ని కూడా బాబు ఆలింగనం చేసుకుంటారు!

SHARE

విశేషమేంటంటే జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడట౦. ఓటు కు నోటు కేసు కి భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకాలం కేంద్రాన్ని ఒక్క మాటా అనలేదని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను అన్ని విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాందీని చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం చూస్తే చూడ ముచ్చటేసింది అని పవన్ అన్నారు.అంతటితో ఆగక రేపు మాపో ఇలానే జగన్ మోహన్ రెడ్డిని కూడా బాబు ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్,బిజెపి, వైసిపి లు మూడు పార్టీ లతో కలిసి తెదేపా పోటీచేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.

తెలుగుదేశం వారి వద్ద ఇసుక మాఫియా డబ్బు చాలా ఉందని పవన్ ఆరోపించారు. ఓటుకు నోటుకు భయపడి చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగార్చారని పేర్కొన్నారు. అలానే హెరిటేజ్ మాజీ ఉద్యోగికి పైబర్ గ్రిడ్ అప్పగించారని ఆయన ఆరోపిచంచారు.