Home రాజకీయాలు “చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కి అరువు మైకు”

“చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కి అరువు మైకు”

63
SHARE

ఏపీలో ప్రభుత్వ పరిపాలన గాడి తప్పింద౦టూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వాపోయారు. గుంటూరులో ఇవాళ కన్నా చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ పక్కన అవినీతి పెచ్చరిల్లిపోతోందంటూ మరోపక్క ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని కన్నా ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో ఏం చేశామో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందన్నారు. రాజధాని రైతులకు బాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ వారి భూముల్ని రియల్ ఎస్టేట్‌కు అమ్ముకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో బాబు డబుల్ గేమ్ ఆడార౦టూ చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగింది అని కన్నా విమర్శించారు.

రెండు సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాధించామని చంద్రబాబు స్వీట్లు పంచి అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడుకు ఎన్నో సన్మానాలు చేశార౦టూ గుర్తుచేశారు. చంద్రబాబు పెద్ద మాయగాడు, విజయవాడలో జరుగుతుంది మహానాడు కాదు మాయనాడు అన్నారు.

అధికారంలో రావటానికి బీజేపీని వాడుకుని అవసరం తీరాక పార్టీని దోషిగా నిలబెడుతున్న ఘనత చంద్రబాబుది అన్నారు. టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకడుతూ ఆ పార్టీకి అద్దె మైకులా మారారన్నారు.

పార్టీ వ్యవస్థాపకుడికి ఇదంతా ఆత్మ క్షోభే అంటూ కన్నా ఘాటుగా వ్యాఖ్యానించారు.