Home రాజకీయాలు జూన్ 4… వైకాపాకు చాలా కీలకం!

జూన్ 4… వైకాపాకు చాలా కీలకం!

SHARE

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏకదాటిగా, అవిరామంగా కొట్లాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది కచ్చితంగా వైకాపా అనే చెప్పుకోవాలి. వీరికి తోడు కమ్యునిస్టులు, ప్రజాసంఘాలు తలో చేయి వేస్తున్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో.. బీజేపీతో తోడు కలిసిన బాబు, అప్పట్లో ప్రత్యేకహోదాకు తూట్లుపొడిచిన సంగతి ఎవరూ మరిచిపోలేనిది. ఆ సంగతులు అలా ఉంటే… అధినేత జగన్ సూచనల మేరకు ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు వైకాపా ఎంపీలు. ఇది దేశ చరిత్రలో కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. తమ ఎంపీ పదవులకు రాజినామాలు సమర్పించారు. అయితే.. ఇప్పటికీ అవి ఆమోదించలేదు స్పీకర్! దీంతో జూన్ 4 చాలా కీలకంగా మారిపోయింది!!

ప్రజాభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో తమ రాజినామాలు సమర్పించారు వైకాపా ఎంపీలు. అయితే.. అవి ఇప్పటికీ ఆమోదించలేదు స్పీకర్! దీంతో తమ రాజినామాలు ఆమోదింపచేసుకోవడానికి రంగంలోకి దిగుతున్నారు వైకాపా ఎంపీలు. తమ రాజినామాలను ఆమోదింపచేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఈ ప్రత్యేక హోదాపై ప్రజల కోరిక ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఉపేన్నికలు రావాలని వారు భావిస్తున్నారు. ఆ ఓట్ల మెజారిటీ ఢిల్లీకి వినబడే రేంజ్లో ప్రజల మద్దతు కూడగట్టాలనేది వారి ఆలోచన. ఈ క్రమంలో ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసి, రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని చెబుతున్నారు వైకాపా ఎంపీలు!

అన్నీ అనుకున్నట్లుగా జరిగి.. ఈ నెల 29న స్పీకర్ సుమిత్రా మహజన్.. వైకాపా ఎంపీల రాజినామాలను ఆమోదిస్తే మాత్రం వీలైనంత త్వరలోనే ఉపేన్నికలు వస్తాయి. టెక్నికల్ విషయాల ప్రకారం ఈ రాజినామాల ఆమోదం అనేది జూన్ 4 లోపు జరగాలనేది వారి పట్టుగా ఉంది. రాజ్యాంగ పరిమితుల మేరకు జూన్ 4 లోపు గనుక ఈ రాజినామాలు ఆమోదింపబడితే కచ్చితంగా ఆ ఎంపీస్థానాలన్నింటికీ ఉప ఎన్నికలు వస్తాయి. కాబట్టి… జూన్ 4 అనేది వైకాపా ఎంపీలకు చాలా కీలకంగా మారింది! అదే జరిగి.. ఆ రోజు లోపు స్పీకర్, వైకాపా ఎంపీల రాజినామాలు ఆమోదిస్తే మాత్రం.. ఏపీలో ఒక చారిత్రక ఘట్టానికి తెరలేచినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!