Home రాజకీయాలు వైయస్ఆర్ కాంగ్రెస్ కువైట్ వారి సహాకారంతో స్వస్ధలం చేరిన మహిళ మృతదేహాం

వైయస్ఆర్ కాంగ్రెస్ కువైట్ వారి సహాకారంతో స్వస్ధలం చేరిన మహిళ మృతదేహాం

SHARE

కువైట్: వై.యస్.ఆర్ సి. పి. గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే కోడూరు పట్టణానికి చెందిన షేక్ జుబేదా బేగం ( షేఖా ) గత 28 సం:ల నుండి మ్యాన్ పవర్ ఆఫీసులో పనిచేస్తున్నారు వీరి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కూతురు అల్లుడు కువైట్ లోనే ఉన్నారు. షేఖా స్వతహాగా వై.యస్.ఆర్. కుటుంబ వీరాభిమాని. కువైట్ లో జరిగే పలు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే వారు.

25 – 05 – 18 న గుండె పోటుతో ఆకస్మికంగా మరణించారు బంధువులు మృతదేహాన్ని ఇండియా పంపెందుకు సహాకరించాలని బాలిరెడ్డి గారికి అభ్యర్ధించగా వెంటనే స్పందించి సేవాదళ్ ఇంచార్చ్ గోవిందు రాజు, గవర్ని౦గ్ కౌన్సిల్ సభ్యుడు తెట్టు రఫీ గారికి తెలపగా వారు భారత రాయబారకార్యాలయ కువైట్ ఇమిగ్రేషన్ పనులన్ని పూర్తి చేశారు టికెట్ మరియు బాక్స్ ఖర్చులు 75 వేల రూపాయలు మానవతా దృక్పధంతో మ్యాన్ పవర్ ఆఫీసులలో పని చేసే ఉద్యోగస్తులు ఇచ్చారు. కమిటీ సభ్యుల అభ్యర్ధన మేరకు చెన్నై నుండి స్వస్ధలం వరకు  ఉచితంగా అంబులెన్స్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు యువనేత మానవతావాది పి.వి మిథున్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు.

ఇలియాస్, బాలిరెడ్డి, గోవిందు నాగరాజు, నాయని మహేశ్వర్ రెడ్డి, తెట్టు రఫీ, గోవిందు రాజు, మర్రి కళ్యాణ్, సయ్యద్ సజ్జాద్ షా హుస్సేన్ మరియు బంధువులు సభ ఆసుపత్రి మార్చురీలో  షేఖా పార్థివ శరీరాన్నిసంధర్షించి ఘన నివాళిలు అర్పించి కమిటీ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు.