Home రాజకీయాలు బాబు ద్వంద్వ నీతి పై జగన్ వ్యంగ్యాస్త్రాలు

బాబు ద్వంద్వ నీతి పై జగన్ వ్యంగ్యాస్త్రాలు

64
SHARE

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు వేడుకలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశిస్తూ జగన్: ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్, ఆయన ఇల్లు, పార్టీని లాగేసుకున్నారని, అంతేకాక ఆయన మృతికి కూడా కారణమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారంటూ ఏపీ మహానాడులో మొసలికన్నీరు కార్చిన చంద్రబాబు, తెలంగాణ మహానాడులో తన వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవడం ఏ నీతి అని అడిగారు. ఈ ద్వంద్వ నీతి బట్టి ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవచ్చని జగన్ అన్నారు

నాలుగేళ్ల బాబు పాలనలో అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తప్ప ప్రజలకు చేసింది వీసమంతైనా లేదని, ఏపీ అవినీతి దందా విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు.

ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటిస్తామని తాము చెప్పాక ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు రెండు రూపాయలకు యూనిట్ కరెంట్ ఇస్తామని చెప్పడం గుర్తుచేశారు. అది కూడా కేవలం సంవత్సరం వరకు మాత్రమే సబ్సిడీ కరెంటు ప్రకటించారని జగన్ విమర్శించారు.

తమ ప్రభుత్వం రాగానే ఐస్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్లకు 5 రూపాయలకే యూనిట్ కరెంట్ ఇస్తామని, అలానే దళారీ వ్యవస్థను అంతమొందిస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, కోల్డు స్టోరేజీలు నెలకొల్పుతామని చెప్పారు. ఆక్వా రైతులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ నాలుగో సంవత్సరంలో ఆక్వా పంటకు మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారు.