Home ట్రైలర్స్ ఆఫీసర్ లేటెస్ట్ టీజర్స్.. సౌండ్ ఎఫెక్ట్ అదుర్స్!

ఆఫీసర్ లేటెస్ట్ టీజర్స్.. సౌండ్ ఎఫెక్ట్ అదుర్స్!

313
SHARE

రాంగోపాల్ వర్మ, నాగార్జున ఆఫీసర్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెరిగింది. జూన్ 1 న విడుదలకు సిద్ధం అయిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని సోమవారం సాయంత్రం నిర్వహించబోతున్నారు. నాగార్జున, రాంగోపాల్ వర్మ సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వస్తున్న చిత్రం ఇది. ముంబై మాఫియా నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా వర్మ మరో రెండు టీజర్స్ ని విడుదల చేశారు.

నాగార్జున ఈ చిత్రంలో ఎలాంటి విన్యాసాలు చేశాడో శాంపిల్ గా ఓ టీజర్ విడుదల చేశాడు. తన కుమార్తెతో సరదాగా ఉండగా ఉహించని విధంగా అటాక్ మొదలవుతుంది. నాగ్ వెంటనే అలెర్ట్ అయిన అతడి గుండెల్లో బుల్లెట్ దించుతాడు.

మరో టీజర్లో నాగ్ రౌడీ ముక్కలు ఉన్న డెన్ లో సెర్చింగ్ చేస్తున్న సన్నివేశం చాలా ఉత్కంఠని కలిగిస్తోంది.