Home ప్రత్యేకం అఖిల్‌కు సింధూ.. చై కు అఖిల్‌ సవాల్‌

అఖిల్‌కు సింధూ.. చై కు అఖిల్‌ సవాల్‌

SHARE

ఇప్పుడు దేశం మొత్తం ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌లో మునిగిపోయింది. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. భారతీయులు అంతా ఫిట్‌గా ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ అభిలాష అని అందుకే ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించానని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. పుషప్స్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేస్తూ.. హృతిక్‌ రోషన్‌, విరాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌లకు సవాలు విసిరారు. రాథోడ్‌ ఛాలెంజ్‌ను సైనా, హృతిక్‌ స్వీకరించారు.

సైనా ఫిట్‌నెస్‌ కసరత్తులు చేసే వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంటూ నటుడు దగ్గుబాటి రానాతో పాటు క్రీడాకారులు పి.వి సింధు, గౌతమ్‌ గంభీర్‌లను నామినేట్‌ చేసింది. సింధు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లో పాల్గొని నటుడు అఖిల్‌ను నామినేట్‌ చేసింది. అఖిల్‌.. సింధు సవాల్‌ను స్వీకరించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేస్తూ..‘ఛాలెంజ్‌ చేసినందుకు ధన్యవాదాలు పి.వి సింధు. మీరు కూడా ఇలాగే ఫిట్‌గా ఉండడానికి కసరత్తులు చేస్తూ మీ స్నేహితులతో ఛాలెంజ్‌ చేయండి. నేను నాన్నతో పాటు వరుణ్‌ ధావన్‌, నాగ చైతన్య, దుల్కర్‌ సల్మాన్‌లతో సవాలు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

నాగ చైతన్య కూడా అఖిల్‌ సవాల్‌ను స్వీకరించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేస్తూ సమంత, సుమంత్, నిధి అగర్వాల్ లకి ఛాలెంజ్‌ చేసారు. మరి వీరందరిలో అఖిల్‌, నాగ చైతన్య సవాలును ఎవరు ముందు స్వీకరిస్తారో వేచి చూడాలి.‌.