Home రాజకీయాలు ఒకే కోరిక: ఏపీలో పవన్ ది.. టిలో బాబుది!

ఒకే కోరిక: ఏపీలో పవన్ ది.. టిలో బాబుది!

70
SHARE

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… కర్ణాటకలో తాజాగా జరిగిన వ్యవహారం రాజకీయ బలహీనులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అధికారంపై ఏమాత్రం ఆశలు లేనివారికి కూడా కర్ణాటకలో ఏర్పడ్డ కాంగ్రెస్ – జేడీఎస్ ల ప్రభుత్వం కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది! ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్.. తెలంగాణలో చంద్రబాబుల ఆశలకు కుమారస్వామి పరోక్షంగా నీళ్లు పోసి చిగురించేలా చేశారు! ప్రతిచోటా, ప్రతి పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితులే ఉంటాయని చెప్పలేం కానీ… రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో.. నేటి కర్ణాటక పరిస్థితులే వస్తాయనా గుడ్డి నమ్మకంతో ముందుకుపోతున్నారు వీరిద్దరూ!

ఏపీలో ఉన్నవి మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు కాగా… తెలంగాణలో ఉన్నవి 119 స్థానాలు. వీటిలో మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునే పరిస్థితి ఎట్టాగూ లేదు, ఆ ఆశ ఆ పార్టీల అధినేతలకూ లేదు! దీంతో కర్ణాటకలో కుమారస్వామి అదృష్టమే తమకూ పడుతుందేమో అనే భ్రమలో ముందుకుపోతున్నారు చంద్రబాబు అండ్ కో! ఈ విషయాన్ని బహిర్గతం చేసేలా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారట చంద్రబాబు! ఉన్న 119స్థానాల్లో కేవలం 30 సీట్లకు మాత్రమే పూర్తిగా టార్గెట్ పెట్టుకోండి చాలు.. అధికారం మనదే అని నాయకులకు సూచించారట చంద్రబాబు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయావకాశాలపై చంద్రబాబుకు కూడా నమ్మకం సన్నగిల్లినట్టుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయనుకోండి. అది వేరే విషయం.

ఇదే క్రమంలో ఏపీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా… తాను 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించుకోవడం వెనక కూడా కుమార స్వామి ఇచ్చిన పరోక్ష ప్రోత్సాహమే కారణం అని అంటున్నారు. పవన్ కల్యాణ్ కు ప్రస్తుత ఏపీ పరిస్థితుల్లో 175స్థానాలూ పోటీ చేయగలిగే సత్తా ఉందో లేదో అనే విషయం పక్కన పెడితే… మ్యాజిక్ ఫిగర్ సింగిల్ గా సాధించే పరిస్తితులైతే దాదాపుగా ఉండవు! ఈ క్రమంలో పవన్ చేబుతున్న ఈ ధీమా మాటలు కూడా కర్ణాటక పరిస్థితులే కారణం అని తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్.. తెలంగాణలో చంద్రబాబు.. ఈ రకంగానే ముందుకు పోతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీకి 30 సీట్లు సాధ్యమా… ఏపీలో పవన్ కు 1 నుంఛి 5 స్థానాలు రావొచ్చని సర్వేలు చెబుతున్న తరుణంలో.. 30సీట్లు సాధ్యమా… కాస్త వేచి చూడాల్సిందే!!