Home ప్రత్యేకం ఏపీ లో మరో పడవ ట్రాజెడీ!

ఏపీ లో మరో పడవ ట్రాజెడీ!

58
SHARE

అదేం ఖర్మో గాని ఏపీలో పడవ ప్రమాదాల జోరు గగుర్పాటుకు గురిచేస్తో౦ది. ఈ దుర్ఘటనల పరంపర ఎప్పటికి ఆగేనో…!ఈ రోజు ఉదయం మరో పడవ ప్రమాదం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ప్రమాదం తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద జరిగినట్టు సమాచారం. ప్రమాదంలో తల్లి కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

కృష్ణాజిల్లా లోని ఇబ్రహీంపట్నం నుంచి ఒక కుటుంబం చేపలవేటకి కృష్ణానదిలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇసుకను తరలిస్తున్న మరో బోటు వీరి పడవను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో తల్లీకూతురు నీటిలో మునిగిపోయారు. యజమాని మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మృతి చెందిన ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. వీరి మృత దేహాలు చూపరులకు కంట నీరు తెప్పించాయి. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇసుక తీసుకువస్తున్న పడవ కి లైసెన్స్ ఉన్నదా లేదా అసలు ఆ పడవ అక్రమంగా ఇసుక రవాణా చేస్తోందా అన్న ప్రశ్నలు కూడా వున్నాయి.