Home సినిమా బయోపిక్ ఆలోచనలో నాగ్?

బయోపిక్ ఆలోచనలో నాగ్?

SHARE

టాలీవుడ్ లో బయోపిక్‌ల ట్రెండు నడుస్తోంది. రుద్రమదేవి,గౌతమి పుత్ర శాతకర్ణి, మహానటి, సినిమాల తర్వాత, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వున్నది. అయితే మహానటి సినిమా సూప‌ర్ హిట్ అవ్వటంతో చాలా మందికి కొత్త ఆశలు కలిగించింది.

బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ జీవిత క‌థని ప‌ట్టాలెక్కించటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా బ‌యోపిక్‌ల ప‌రంప‌ర‌కు టాలీవుడ్‌లో ఓ కొత్త జీవం వ‌చ్చి౦ది.

తాజాగా నాగార్జున‌ ఏఎన్నార్ బ‌యోపిక్ గురించి ఆలోచ‌న చేస్తున్నట్టు సమాచారం. సావిత్రి క‌థ‌లోలాగానే అక్కినేని క‌థ‌లో కూడా ఒక మాలోంకోలి ఉంది, ఎన్నో ఎత్తు ప‌ల్లాలు… ఎన్నో విజ‌యాలు…ఎన్నో మనస్పర్థలు..ఇక ఏఎన్నార్ మ‌ర‌ణం లో ఎంతో ట్రాజెడీ .. ఓవరాల్ గా బయోపిక్ కి ఓ అద్భుత‌మైన క‌థ అని చెప్పవచ్చు.

గుర్తు చేసుకుంటే ఏఎన్నార్ ఓ ప్రెస్ మీట్ పెట్టి తనకి కాన్స‌ర్ వున్నది అని చెప్పడం ఎంతోకాలం బ‌త‌క‌ను` అని చెప్పడం ….పేషెంట్ గానే మనం సినిమా చేయడం, ఆఖరి క్షణాల్లో మంచం పై నుంచే త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవటం..ఇలా ఊపిరి ఉన్నంత వ‌ర‌కూ న‌టిస్తూనే ఉన్నారు.

ఇక ఆయన పై బ‌యోపిక్ అంటే అది నాగార్జున తీయటమే న్యాయం కూడా. అందుకే నాగ్ ఏఎన్నార్ బ‌యోపిక్ గురించి త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు పడుతున్నాడ‌ని ఫిలింనగర్ భోగట్టా. కొంత‌మంది ర‌చ‌యిత‌లను ఆల్రెడీ నాగ్ కలిసి సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ట‌. అధికార ప్ర‌క‌టన కోసం వెయిట్ చేద్దాం!!