Home రాజకీయాలు దళితుడిని కాబట్టే నాకీ అవమానం: మోత్కుపల్లి

దళితుడిని కాబట్టే నాకీ అవమానం: మోత్కుపల్లి

SHARE

తెలంగాణ తెలుగు దేశం పార్టీ లీడర్ మోత్కుపల్లి పార్టీ హై కమాండ్ పై మాటల దాడికి దిగారు. ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన మోత్కుపల్లి పార్టీ లో తనకు జరుగుతున్న అవమానాలు ఏకరువు పెట్టారు. నిన్న పార్టీ మినీ మహానాడు కు తనకు ఆహ్వానం అందని విషయం చెప్తూ తెదేపా నించి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను ఇంతలా అవమానిస్తున్నారని టీటీడీపీ నేత అన్నారు. ఇంకా తనను టీడీపీ నుంచి పంపేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మోత్కుపల్లి ఆరోపించారు.

తాను టీడీపీ కోసం నిజాయతీగా గత 30 ఏళ్లుగా చేస్తున్నానని చెప్పిన ఆయన ఇంత చేస్తున్న తనకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకి కేవలం 5 నిమిషాలు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని, తాను చేసిన తప్పేంటని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబును నమ్మి తాను చాలా కోల్పోయానని చెప్పిన ఆయన దళితుడిని కావటం వల్లే తనని ఇంతలా అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. మన 6 సార్ల ఎంఎల్ఏ దారెటు? తెరాస వైపా లేక భాజపా నా?? ఏ నిర్ణయం తీసుకుంటారో కాలమే చెప్తుంది