Home రాజకీయాలు అన్యాయం జరిగితే అవతరణ దినోత్సవం క్యాన్సిల్ ఎంటండీ?

అన్యాయం జరిగితే అవతరణ దినోత్సవం క్యాన్సిల్ ఎంటండీ?

60
SHARE

ఎపిని కాంగ్రెస్ అన్యాయంగా విభజించింది అంటూ ప్రమాణ స్వీకారం దగ్గరనుండి చంద్రబాబు అంటూనే వున్నారు. ఆ రకంగా మొదట్నుంచీ తనపై ప్రజల్లో ఓ రకమైన సింపతీ తెచ్చుకోగలిగారు. కానీ ఇందాక ఈ సింపతీ?
ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవమే తీసుకుందాం? ఓ పక్క తెలంగాణ ఆర్భాటంగా అవతరణ దినోత్సవం చేసుకుంటుంటే ఎపి ప్రభుత్వం రాష్త్ర ఉనికినే ప్రశ్నార్దకం చేసే లా వ్యవహరిస్తోంది. ఐదో సంవత్సరం అయినా మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవట్లేదట. ముఖ్యమంత్రి ఆ విధంగా ప్రకటించారని వార్త.

కారణం ఏంటంటే రాష్ట్రానికి అన్యాయం జరిగిందట అందుకె అవతరణ దినం ఉందట. ఏంటిది? నాలుగేళ్లు గడిచినా రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆయనన్నారు. ఈసారి కూడా జూన్‌ 2వ తేదీ ఉదయం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద నవనిర్మాణ దీక్ష నిర్వహించబోతున్నామని, అక్కడ తాను ప్రజలతో దీక్ష ప్రతిజ్ఞ చేయించనున్నట్లు బాబు తెలిపారు.

ఒక్కోక్క రోజు ఒక్కోక్క జిల్లాలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని కాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. జూన్ 8 వరకు జరిగే నవ నిర్మాణ దీక్షల సందర్భంగా 12 వేల గ్రామాల్లోను ప్రతీ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారట. పన్నెండు వేళా గ్రామాల్లో ప్రతీ రోజూ సాంస్కృతిక కార్యక్రమాలంటే మాటలా? ఇన్ని కోట్ల ఖర్చు అన్యాయం జరిగితే పెడుతున్నారా?