Home రాజకీయాలు సుప్రీమ్ లో బాబు ని రాహుల్ గాంధీ వచ్చి రక్షించేనా?

సుప్రీమ్ లో బాబు ని రాహుల్ గాంధీ వచ్చి రక్షించేనా?

SHARE

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ౦ చెలాయిస్తున్న జోక్యం పై ఆలయ ప్రధాన అర్చకుడు ఏ వీ రమణ దీక్షితులు గత కొ౦త కాలం గా ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.

తాజాగా TTD వ్యవహారం విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థాన౦ సుప్రీమ్ కోర్టుకి చేరుకోబోతో౦ది. ఆలయ ప్రధాన అర్చక పదవి నుండి రమణ దీక్షితులు కు ఉద్వాసన చెప్పటం పట్ల భాజపా అదినేత, ఎంపి సుబ్రమణ్యస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.

తిరుమల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఉండరాదనీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆభరణాల మాయ౦ పై, నిధుల దుర్వినియోగం పై, శీఘ్రంగా కూలంకుషంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ కావాలని స్వామి డిమాండ్ చేశారు.

దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేనట్లయితే దేవాలయాలలో లూటీలు ఇలానే కొనసాగుతాయని అయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తితిదే సమీక్ష నిర్వహించే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్కడిదని స్వామి ప్రశ్నించారు. ఇక ఢిల్లీ లో స్వామి అమిత్ షా రాజకీయాలు బాబుని ఇరకాట౦లో పడేయటానికాని చెప్పాల్సిన పని లేదు. కర్ణాటక ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవంలో చంద్ర బాబు రాహుల్ గాంధీ ని పలకరించిన విధానం చూసినవారు రాహుల్ వచ్చి బాబుని రక్షిస్తాడా అని పబ్లిక్ గానే గుసగుసలాడుతున్నారు.