Home ప్రత్యేకం మహానటి లో మిస్సమ్మ సీన్‌ను ఎందుకు తీసేశారు?

మహానటి లో మిస్సమ్మ సీన్‌ను ఎందుకు తీసేశారు?

64
SHARE

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ కి తొలి రోజు నుంచే మంచి ఆదరణ లభిస్తోంది. ఇక చిత్ర నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను మేకర్లు ఒక్కోక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ మిస్సమ్మ సినిమాలోని వారాయో వెన్నిలావే (రావోయి చందమామ) సాంగ్‌ సీన్‌ను దుల్కర్‌ సల్మాన్‌, నిర్మాతలు విడుదల చేశారు. జెమినీ గణేషన్‌-సావిత్రి రోల్స్‌లో దుల్కర్‌-కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన సీన్‌ ఆకట్టుకునేలా ఉంది.

అయితే బాగున్న ఈ సీన్‌ను ఎందుకు తీసేశారని? సినిమాలో ఉంచాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్‌ వద్ద రూ. 30 కోట్లకు పైగా సాధించటంతోపాటు ఓవర్సీస్‌లోనూ మహానటి ప్రభంజనం కొనసాగిస్తోంది. సమంత, విజయ్‌ దేవరకొం‍డ, రాజేంద్ర ప్రసాద్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న, ప్రియాంక దత్‌లు సంయుక్తంగా నిర్మించారు.