Home రాజకీయాలు పరకాల – పొమ్మనలేక పొగ పెట్టడం అంటే ఇదే!!

పరకాల – పొమ్మనలేక పొగ పెట్టడం అంటే ఇదే!!

55
SHARE

ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు గా భాజపా తో తెదేపా సంబందాలు కట్ అవ్వడం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార ప్రధాన సలహాదారుడు పరకాల ప్రభాకర్ కు బ్యాడ్ అయ్యింది.

AP సర్కార్ ఆయన్ను పదవిలో వుంచినట్టే కలరింగ్ ఇచ్చి నిమిత్తమాత్రుడుగా చేయడం ఆంధ్రా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది. ఎమ్ గ్రూప్ లో పనిచేస్తున్న సంజయ్ అరోరాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన మీడియా సలహాదారునిగా నియమించారు.

ఇక దీంతో పరకాల కి దోమలు తొలి పని తప్ప ఇంకేమి ప్రాధాన్యం లేదు. ఇటీవల జరిగిన కలెక్టర్ ల సమావేశంలో సంజయ్ అరోరా ని అదికారులకు సిఎమ్ చంద్రబాబు పరిచయం చేశారు.

పరకాల ప్రభాకర్ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కి భర్త అన్నది తెలిసిందే కదా. భాజపా తెదేపా సంబంధాలు తెగిపోవటం తో పరకాల ద్వారా కేంద్రానికి, భాజపా కి తమ సమాచారం చేరుతోందేమోననే అనుమానం సిఎమ్ కి ఉండటంతో ఈ మార్పు జరిగిందని వార్త.

పర్కాలని తొలగించే విషయం కూడా చర్చించారట అయితే వెంటనే తొలగిస్తే మరీ ఇబ్బంది అవ్వొచ్చు అని భావించి మనసా వాచా కర్మణా దూరంగా పెట్టారట. పొమ్మనలేక పొగ పెట్టడం అంటే ఇదేనెమో అని అంతా అనుకొంటున్నారు.