Home రాజకీయాలు కేసీఆర్ కున్న పౌరుషం బాబుకులేదెందుకో!

కేసీఆర్ కున్న పౌరుషం బాబుకులేదెందుకో!

SHARE

రాజకీయాల్లో శాస్వత శతృవులు, శాస్వత మితృతులు ఉండరనేది పాతమాటే అయినా కూడా… దానికి కూడా కాస్తో కూస్తో ఆతాభిమానం, పౌరుషం వంటివి అప్పుడప్పుడూ అయినా గుర్తుకువచ్చేలా ప్రవర్తించాలని అంతా అంటుంటారు. పైన చెప్పుకున్న సూత్రం ఒకటి ఉందికదా అని నిస్సుగ్గు చర్యలకు, అనైతిక పొత్తులకు పాల్పడి తాత్కాలిక సంతోషాల వేటలో శాస్వత పతనాన్ని కోరుకుంటామని ఎవరైనా భావిస్తే.. అది ఆత్మహత్యా శాదృశ్యమే తప్ప మరొకటి కాకపోవచ్చు. ఈ విషయంలో కేసీఆర్ కి ఉన్న పౌరుషం.. బాబు చేస్తున్న ఆత్మహత్యా సాదృశ్యాలు తాజాగా సంఘటనతో వెలుగులోకి వచ్చాయి.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయమని కాని, జేడీఎస్ ను గెలిపించమని కాని చంద్రబాబు నాయుడు ఎక్కడా చెప్పింది లేదు! ఒకరిద్దరిని అధికారికంగానూ, అనధికారికంగానూ కర్ణాటకకు పంపి తెలుగువారితో మాట్లాడించడం మినహా ఆయన చేసింది శూన్యం. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం… కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన బీజేపీ ఓడిపోవడానికి తానే కారణం అని చెప్పుకొస్తున్నారు. అది బాబు గురించి తెలిసినవారికి పెద్ద ఆశ్చర్యం అనిపించకపోవచ్చు. ఆ సంగతి అలా ఉంటే… కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన బాబు తన పౌరుషం తాలూకు పెర్సంటేజీని చెప్పకనే చెప్పారు!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ కు పూర్తి శతృత్వం వచ్చేసింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నా.. తనవైఖరిలో మార్పు రాకుండా రాష్ట్ర ప్రయోజనాల పేరు చెప్పి ముందుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తో వేదిక పంచుకోవడానికి కూడా కేసీఆర్ సిద్దంగా లేకపోవడం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే… కర్ణాటకలో జేడీఎస్ కు ఓటేయమని నేరుగా చెప్పిన కేసీఆర్ కు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ప్రధాన ఆహ్వానం అందలేదని అనుకోలేం. ఈ క్రమంలో కేసీఆర్ వెళ్తే గనుక, బాబుకు దక్కిన ఆహ్వానం కంటే ఘనమైన రిసీవింగే ఉండేది. కానీ… కాంగ్రెస్ పంచుకునే వేదికపై తానుకూడా చేరి చేతులు ఊపడానికి కేసీఆర్ సిద్దంగా లేరు!

కానీ… జేడీఎస్ విజయంలో, కాంగ్రెస్ విజయంలో ఏమాత్రం సంబందం లేని వ్యక్తి, పిలిచారు కదా అని పరుగెట్టుకుంటూ వెళ్లారు! దానికి కారణం… దేవెగౌడను ప్రధానిని తానే చేశానని చెప్పుకోవడం వల్ల! అదేంటి… రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, అన్యాయం చేసిన పార్టీకి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని వ్యతిరేకంగా పోరాడాలి కదా.. పెళ్లికి వెళ్లినట్లు వెళ్లి కాంగ్రెస్ నాయకుల చేతులు పిసుకుతూ, భుజాలు తడుతూ.. హస్తం గుర్తు జనాలకు చూపించడం ఏమిటీ? ఇది బాబుగారే చెప్పాలి. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన పార్టీ అధినేతలతో బాబు ఇలా అంటకాగడాన్ని ఏమనుకోవాలి.. దాన్ని రాజకీయాల్లో శాస్వత శతృవులు, శాస్వత మితృతులు ఉండరని టీడీపీ నేతలు టీవీల ముందు కూర్చుని సమర్ధించడాన్ని ఏమనుకోవాలి.. కేసీఆర్ కు ఉన్న పౌరుషం బాబులు లేదెందుకో అని ప్రశ్నించుకోవడం మినహా!!