Home రాజకీయాలు ఎన్టీఆర్ ఆత్మ సంగతేంది?

ఎన్టీఆర్ ఆత్మ సంగతేంది?

SHARE

ఎవరు ఏమనుకున్నా పర్లేదు.. అధికారమే ముఖ్యం, అధికారంలోకి రావడమే ముఖ్యం.. ఇందులో నైతికత, ఆత్మాభిమానం వంటి పదాలకు ఏమాత్రం తావులేదని ఫిక్సయినట్లున్నారు చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తానుచేసిన చారిత్రక నేరం అని చెప్పిన కొన్నేళ్లకే వారితో అంటకాగిన నైజం బాబు సొంతం! ఆ రేంజ్ మనిషి రేపు ఎన్నికల వేళ అవసరం అయితే ఏపార్టీతో అయినా పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారనే అనుకోవాలి. ఆ మేరకు నిన్నమొన్నటివరకూ కాస్త పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన బాబు.. నేడు కొన్ని సంకేతాలు నేరుగా ఇచ్చేస్తున్నారు. అందులో ప్రధానమైంది.. భవిష్యత్తులో తమ మిత్రత్వం కాంగ్రెస్ పార్టీతో అయినా కూడా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు, ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆశ్చర్యపోకండి అని!

అవును… తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అతిధిగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు… అక్కడ రాహుల్ గాంధీతో ప్రవర్తించిన విధానం, పిసికిన విధానం సగటు టీడీపీ కార్యకర్తకు నిద్రలేకుండా చేస్తుందట. ఈలెక్కన చూసుకుంటే… నేడో రేపో ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తానంది అని సాకు చెప్పి.. బాబు సైకిల్ హస్తానికి అందించినా ఆశ్చర్యపోనక్కరలేదు! అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిరేకంగా కదా అని ఎవరైనా అమాయక జనాలు, అమాయకపు టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తే… ఇది ఎన్టీఆర్ టీడీపీ కాదని సర్ధుకోవడం మినహా మరో మార్గం లేదనే చెప్పాలి!!

ఇక్కడ మరో విషయం ఏమిటంటే… బాబు కర్ణాటక వెళ్లింది కూడా దేవెగౌడకోసమో, తృతియ ఫ్రంట్ కోసమో, స్థానిక పార్టీలను ఏకం చేయడం కోసమో అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఆ పనికి ఇప్పటికే పూనుకుని పర్యటనలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక టీడీపీ అంటారా… అది ప్రాంతీయ పార్టీకాదు.. అది జాతీయ పార్టీ! ఈలెక్కన చూసుకుంటే… బాబు, కుమారస్వామి ప్రమాణస్వీకారం పేరుచెప్పి కాంగ్రెస్ అధినేతలతో ముచ్చటించి ఉంటారనేది పలువురి అభిప్రాయంగా ఉంది. రేపో మాపో… బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని తానే పిలుపునిచ్చానని, అందులో భాగంగా అందరినీ తానే కలుపుకుపోతున్నానని చెప్పి, కాంగ్రెస్ చేతిలో చేయివేసినా ఆశ్చర్యపోనవసరం లేదు!!

మరి టీడీపీ ఇన్ని పనులు చేస్తుంటే ఎన్టీఆర్ ఆత్మ సంగతేంది, తెలుగు వాడి పౌరుషం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని చెప్పి ఏర్పాటు చేసిన పార్టీ పరిస్థితి ఏమిటి అంటే… రాజకీయాల్లో శాస్వత శతృవులు శాస్వత మితృలు ఉండరని ఇప్పటికే టీడీపీ నేతలు సమర్ధించడం మొదలుపెట్టేశారు. ఇవన్నీ పతనానికి ముందొచ్చే పనికిమాలిన తెలివి తేటలని మరికొందరు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపపడుతున్నారు!!