Home రాజకీయాలు అంబటి మాటలు వినిపించాయా తమ్ముళ్లూ?

అంబటి మాటలు వినిపించాయా తమ్ముళ్లూ?

79
SHARE

టీడీపీ నేతలు నిత్యం చేస్తున్న పసతగ్గిన తమ విమర్శల్లో మొదటిది… బీజేపీ – వైకాపా లాలూచీ పడిపోయాయని! రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో వైకాపా రాజకీయాలు చేస్తుందని! దానికి సరైన సాక్ష్యం ఏమిటి.. సరైన రుజువు ఏమిటి.. చేస్తున్న విమర్శలకు క్రెడిబిలిటీ ఏమిటి అనే విషయంలో టీడీపీ నేతలదగ్గర సరైన సమాధానం లేదు! వారికి ఉన్నదెళ్లా… వైకాపా నాయకులు మోడీని, బీజేపీని తిట్టడం లేదు, విమర్శించడం లేదు అని! దానికి సరైన సమాధానం చెప్పారు అంబటి రాంబాబు!

ఇద్దరు మోసగాళ్ల (చంద్రబాబు – మోడీ) రాష్ట్రానికి అన్యాయం చేశారు.. వారిలో ఎవరు ఎక్కువ అన్యాయం చేశారు అనే విషయంలో వారి మధ్య తగాదా చిత్రం ప్రస్తుతం నడుస్తుంది.. నువ్వుఎక్కువ మోసం చేశావంటే.. కాదు నువ్వెక్కువ మోసం చేశావనే స్థాయిలో.. ఈ ఇద్దరు మోసగాళ్లు తగాదాలాడుకుంటూ, మధ్యలో వైకాపాకు బురద జల్లుతున్నారని అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయంలో చంద్రబాబుది ఎంత నేరమో, మోడీది కూడా అంతే నేరం.. మా వరకూ ఇద్దరూ రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తులే అని పునరుద్ఘాటించారు. దీంతో… రాష్ట్రానికి అన్యాయం జరిగితే స్పందించే విషయంలో వైకాపాకు… టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అనే తేడాలు ఉండవని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అంబటి ద్వారా మరోసారి రుజువైంది.

దీంతో ఇంతకాలం టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శకు తెరపడినట్లయ్యింది! రాష్ట్రానికి మోసం చేశారు అనే విషయంలో మోడీని వైకాపా విమర్శించడంలేదు అని వారు చెప్పుకొస్తున్న విమర్శల్లో పస లేదని, అదంతా సత్యదూరం అని మరోసారి రుజువైంది. అయితే… ఇక్కడ గమనించాల్సిన మరో విషయం… నిజంగా బీజేపీ, వైకాపాలు కలిసి ఉంటే… టీడీపీలోకి దూకిన వైకాపా ఎంపీలపై ఎప్పుడో సస్పెన్షన్ వేటు పడి ఉండేది కదా అని!

సరిగ్గా ఆలోచిస్తే… ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక లు వైకాపా నుంచి గెలిచి టీడీపీలోకి గోడ దూకిన సంగతి తెలిసిందే! వీరిని అనర్హులుగా ప్రకటిచాలని సాక్ష్యాలతో సహా వైకాపా నేతలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతీ తెలిసిందే. అధికారపార్టీ తలచుకుంటే.. వారిని అనర్హులుగా ప్రకటించడం అతిచిన్న విషయం. గతంలో జేడీఎస్ కు చెందిన ఎంపీలు ఇదే పని చేస్తే.. రెండు రోజుల్లో వారిని సస్పెండ్ చేశారు లోక్ సభాధిపతి! ఇదే సూత్రం ప్రకారం లెక్కేసుకుంటే…. టీడీపీ నేతలు చేబుతున్నట్లు వైకాపా-బీజేపీ కలిసిపోయి ఉంటే… ఈ ముగ్గురు ఎంపీలపై చర్యలు తీసుకోవడం చాలా చిన్న విషయం! అదికూడా సాధ్యం కాలేదు!

దీన్ని బట్టి ఆలోచిస్తే… ఇప్పటికీ ఆ ముగ్గురు ఎంపీల విషయంలో చంద్రబాబు, బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి వారిపై స్పీకర్ చర్యలు లేకుండా ఆపుకుంటున్నారని అనుకోవచ్చు! అలా అధికారికంగానో, అనధికారికంగానో బీజేపీతో ఇంకా తెరవెనుక అంటకాగుతున్నది చంద్రబాబే తప్ప వైకాపా కాదనేది స్పష్టం అవుతుంది. ఈ విషయాలు జనాలకు తెలియదనో ఏమో కానీ… వైకాపాపై ఇలాంటి పసలేని అనాలోచిన అజ్ఞాన విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు… వారు చేస్తున్న విమర్శలకు ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందో లేదో వేచి చూడాలి మరి!!