డ్రైవర్ రాముడు పేరు వింటే గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు. హీరోదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రూపొందుతోంది. నవ్వుల వీరుడు ‘షకలక’ శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు రాజ్ సత్య డ్రైవర్ రాముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా లాంఛ్ చేయించారు. ప్రదీప్‌సింగ్ రావత్‌కి శంకర్ మధ్య జరిగే సరదా డైలాగులతో టీజర్‌ను చూపించారు. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శంకర్ మార్క్ కామెడీతోపాటు ఎమోషనల్గానూ కథ ఉంటుందని మేకర్లు చెబుతున్నారు. అంచల్ సింగ్ శంకర్‌కు జోడీగా నటిస్తోంది. ఎమ్.ఎల్. రాజు, ఎస్.ఆర్. కిషన్ నిర్మిస్తున్న డ్రైవర్ రాముడు త్వరలోనే విడుదల కానుంది.