Home రాజకీయాలు వెంకటేశ్వరస్వామి పక్కన వైఎస్సార్ ఫోటో – బాబు!

వెంకటేశ్వరస్వామి పక్కన వైఎస్సార్ ఫోటో – బాబు!

105
SHARE

రమణ దీక్షితులు ఏ ముహూర్తాన్న కొండమీద వ్యవహారాలు బయటపెట్టడం మొదలుపెట్టారో కానీ… నాటి నుంచి టీడీపీ తో సహా పసుపు మీడియా మొత్తం ఆయనపై ఫైరయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? అంటూ మొదలుపెడుతున్నారు. మరి అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కర్ణాటకకు ఎందుకు రాజకీయ ప్రచారం కోసం వెళ్లారు.. ఎవరు పంపారు.. జగమెరిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదేముంది! ఈ క్రమంలో నేరం నాది కాదు కేంద్రానిది అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ధర్మ పోరాట దీక్షలు చేస్తున్న బాబు.. ఆ వేదికపై కూడా రమణ దీక్షితులను వదలలేదు!

రమణ దీక్షితులు వ్యవహారం జాతీయ మీడియాకు ఎక్కడంతో.. గులాబీ వజ్రం, కృష్ణదేవరాయలు సమర్పించిన నగల వ్యవహారంపై ఆ మీడియా దృష్టి పెట్టింది. దీంతో చంద్రబాబు అండ్ కో తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సభావేదికపై రమణ దీక్షితులపై ఫైరయిన బాబు… ఆయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే ఈయన ఎలాంటి స్వామో మీరే అర్ధం చేసుకోండని చెప్పుకొచ్చారు. అంటే… రాజశేఖర్ రెడ్డిని ఆ స్థాయిలో అభిమానించేవారు స్వాములు కాదనా.. వారు నిజాయితీ పరులు కాదనా.. లేక వారు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పరనా? ఇక్కడే బాబు తన ఆలోచనా విధానాన్ని బయట పెట్టారు!

ఎవరు ఇంట్లో ఎవరు ఫోటోలు పెట్టుకున్నారు అనే విషయంపై బాబు స్థాయి మనిషి స్పందించడం ఎంత దిగజారుడు తనమో కాసేపు పక్కన పెడితే… నందమూరి తారక రామారావు ఫోటో ఒక పక్క వైఎస్సార్ ఫోటో ఒక పక్క పెట్టుకునే కుటుంబాలు కూడా రాష్ట్రంలో లేకపోలేదు. ఈ క్రమంలో ఇంట్లో వైఎస్సార్ ఫోటో పెట్టుకునేవారంతా జరుగుతున్న అన్యాయాలపైనా, అవినీతిపైనా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా.. విమర్శించకూడాదా? చంద్రబాబుకే తెలియాలి.

రమణ దీక్షితులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇవ్వడం లేదు సరికదా… ఆయనపై దుమ్మెత్తి పోసే పనికి మాత్రం పుష్కలంగా పూనుకున్నారు. సామాధానాలు చెప్పలేనప్పుడే విమర్శల దాడి పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో రమణ దీక్షితుల పై బాబు అండ్ కో ముప్పేట దాడి చేస్తున్నారు! ఎలా దాడి చేస్తున్నారనే విషయం కాసేపు పక్కన పెడితే… సమాధానాలు ఇవ్వడం లేదనే మాట మాత్రం వాస్తవం! ఇక్కడ మరో విషయం ఏమిటంటే… రమణ దీక్షితుల్ని ఢిల్లీ పిలిపించుకుని బాబుపై ఇలాంటి విమర్శలు చేయిస్తున్నారట. ఇది మరో కొసమెరుపు!!