Home ప్రత్యేకం అనుమతి లేకుండా ఫొటో వేస్తారా..? యాంకర్‌ రష్మి ఫైర్

అనుమతి లేకుండా ఫొటో వేస్తారా..? యాంకర్‌ రష్మి ఫైర్

123
SHARE

బుల్లితెర హాట్‌ యాంకర్‌, నటి రష్మిగౌతమ్‌ ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో నాటా నిర్వహించే ఓ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని, తన అనుమతి లేకుండా ఫొటో ఎలా వేస్తారని ప్రశ్నించారు.

ఇలా తన అనుమతి లేకుండా ఫొటోలు వేయడం ఇదే తొలి సారి కాదన్నారు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చూసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలను గుర్తించిన కొందరు ట్విటర్‌లో తనకు ట్యాగ్‌ చేయడంతో తెలిసిందని పేర్కొన్నారు. ఇక నాటా నిర్వహించే ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్‌, డైరెక్టర్‌ శ్రీనువైట్లతో కలిసి రష్మి హాజరవుతున్నట్లు నిర్వాహకులు కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు.

జబర్దస్త్ ప్రోగ్రామ్ లో 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా రష్మిగౌతమ్‌ హర్షం వ్యక్తం చేసారు.. రష్మి కి అభినందనలు.