Home ప్రత్యేకం ఎన్టీఆర్ బర్త్ డే: సెలబ్రిటీల ట్వీట్స్.. అభిమానులకు పండగ

ఎన్టీఆర్ బర్త్ డే: సెలబ్రిటీల ట్వీట్స్.. అభిమానులకు పండగ

208
SHARE

మాస్‌ ఇమేజ్‌కు నిలువెత్తు నిదర్శనంలా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. 35వ పుట్టిన రోజు నేడు..ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘అరవింద సమేత’ ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు నేడు పండగ రోజు. తమ అభిమాన నటుడు 35వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సెలబ్రేషన్స్ నిర్వహించారు.

సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను విష్ చేస్తూ లక్షలాది సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్… ఇలా ఏది చూసినా అంతా ఎన్టీమయం అయిపోయింది. పలువు సినీ సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్‌ను విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు. మహేష్ బాబు, మోహన్ లాల్, కళ్యాణ్ రామ్, నాని, కాజల్, నివేదా థామస్, ప్రణీత ఇలా పలువురు స్టార్స్ యంగ్ టైగర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్టీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Happy birthday brother!! Have wonderful year ahead. 💪#NTR

Posted by Ram Charan on Sunday, May 20, 2018

హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఫేస్ బుక్ లో రామ్ చరణ్..

యంగ్ టైగర్ పుట్టినరోజును పురస్కరించుకుని హ్యాపీ బర్త్ డే డియర్ అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.