Home సినిమా శర్వానంద్ సినిమాలో సునీల్!

శర్వానంద్ సినిమాలో సునీల్!

SHARE

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘పడి పడి లేచే మనసు’. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కలకత్తాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుతోంది. ఈ షూటింగ్ లో సునీల్ జాయిన్ కాబోతున్నాడు. సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. వెన్నెల కిషోర్ కూడా చిత్ర సెట్స్ లో పాల్గోవడం జరిగింది.

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన నటుడు సునీల్ తర్వాత హీరోగా మారి చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కామెడి పాత్రలు చేస్తున్నాడు. శ్రీను వైట్ల, రవితేజ సినిమాలో కూడా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. శర్వా ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని విధంగా న్యూ లుక్‌లో వెండితెర దర్శనమీయనున్నాడు.