Home సినిమా చెర్రీతో పోటీపడుతూ మరీ హీరోయిన్‌ వ్యాయామం చేస్తున్న వీడియో వైరల్‌

చెర్రీతో పోటీపడుతూ మరీ హీరోయిన్‌ వ్యాయామం చేస్తున్న వీడియో వైరల్‌

SHARE

రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడ చెర్రీ-కైరా ఇద్దరూ పోటీపడి మరీ వర్కవుట్లు చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్‌  కైరా అద్వానీతో కలిసి రామ్‌ చరణ్‌ వ్యాయామం చేస్తోన్న వీడియో అలరిస్తోంది.

బోయపాటి చిత్రం కోసం సరికొత్త యాంగిల్‌లో కనిపించేందుకు రామ్‌ చరణ్‌ బాడీని డెవలప్‌ చేస్తుండగా, కైరా కూడా తానేం తక్కువ కాదంటూ ఎక్సర్‌సైజులు చేసింది. సరదాగా ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, వైరల్‌ అవుతోంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత దానయ్య చెబుతున్నారు. వివేక్‌ ఒబేరాయ్‌, ప్రశాంత్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.