Home రాజకీయాలు పవన్ అను నేను… బయటపడినాను!

పవన్ అను నేను… బయటపడినాను!

76
SHARE

తాను పదవులకోసం అధికారంలోకి రావడం లేదని, కేవలం ప్రశ్నించడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తునానని ఇంతకాలం చెప్పుకొచ్చిన పవన్… ఏకంగా తాను సీఎం అయితే అనే స్థాయిలో రాజకీయ ప్రసంగాలు మొదలుపెట్టేశారు. ప్రజలు అంగీకరిస్తే.. తాను అధ్బుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని తన మనసులో మాట బయటపెట్టారు. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా.. ప్రజల్లోకి ఏ వ్యక్తి వచ్చినా వారి అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావాలనేదే అని పవన్ ద్వారా మరోసారి స్పష్టం అయ్యిందనే అనుకోవాలి. ఈ క్రమంలో తన మనోబావాన్ని పవన్ చాలా తెలివిగా జనాల్లోకి వదిలారు!

గత సభల్లోని ప్రసంగాల్లో… కాబోయే సీఎం అంటూ కార్యకర్తలు – అభిమానులు నినదించిన నేపథ్యంలో పవన్… తాను అధికారంపై ఆశతో రాజకీయాల్లోకి రాలేదని ప్రజాసేవ చేసేందుకు వచ్చానని, ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రజలు తనకు అవకావమిస్తే తప్పకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పుకొస్తున్నారు. గంగవరం పోర్టు నిర్వాసితులతో మాట్లాడిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. “2019ఎన్నికల్లో మీకు న్యాయం అనిపించే పార్టీనే ఎన్నుకోండి. నేను కరెక్ట్ అనుకుంటే జనసేనకే ఓటేయండి. నాకు పూర్తి సహకారం అందించండి. మీ సమస్యలు నేను పరిష్కరిస్తా. నన్ను ఆదరించండి. మీ కష్టాలు తీరుస్తా.” అంటూ పక్తూ పొలిటీషియన్ మాటలు మాట్లాడేస్తున్నారు పవన్!

అయితే దీనికి కారణం కూడా తనదైన శైలిలో చెప్పుకొస్తున్నారు పవన్. గత ఎన్నికల్లో తాను టీడీపీ, బీజేపీకి ఓటేయమని చెప్పానని, కాని వారు ఇచ్చిన వాగ్దానాల్ని నేరవేర్చలేదు కాబట్టి.. ఇప్పుడు నేరుగా తానే రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు. తన కోరికను టీడీపీ బీజేపీల చేతకాని తనం రూపంలో బయటపెట్టిన పవన్… 175 స్థానాల్లోనూ పోటీ చేస్తానని చెప్పి రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “పవన్ అనునేను.. మనసులో మాట ఇలా బయటపెట్టాను”.. అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని జనాలు ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది వేచి చూడాలి!!