Home సినిమా ఫస్ట్ లుక్: లుక్ మాస్.. టైటిల్ క్లాస్!

ఫస్ట్ లుక్: లుక్ మాస్.. టైటిల్ క్లాస్!

74
SHARE

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది… ఎన్టీఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చిన్నసైజు పండగ చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదేమో. దానికి కారణం… ఈ పోస్టర్ మామూలుగా లేకపోవడమే! బ్యాంగ్ బ్యాంగ్ లుక్ తో జూనియర్ ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యింది.

ఈ చిత్రానికి ఫలానా టైటిల్ అని ఎన్ని పుకార్లు వచ్చినా… ఎవ్వరూ ఊహించని రీతిలో “అరవింద సమేత వీర రాఘవ” అని ఫిక్స్ చేశారు. ఇందులో “అరవింద సమేత” అన్నదే పెద్దగా కనిపిస్తూ ఉండగా.. “వీర రాఘవ” ట్యాగ్ లైన్ లాగా ఉంది. కాకపోతే ఎన్టీఆర్ లుక్ కు.. సినిమా టైటిల్ కు మ్యాచ్ కావట్లేదనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో జూనియర్ లుక్ పరమ మాస్ గా ఉంటే.. టైటిల్ మాత్రం చాలా క్లాస్ గా ఉంది!

ఇక ఎన్టీఆర్ లుక్ గురించి చెప్పుకోవాలంటే… న భూతో న భవిష్యత్ అన్నట్లుగా జూనియర్ లుక్ ఉందనే అనుకోవాలి! గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన “టెంపర్” సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించినప్పటికీ అది కాస్త ఇప్పుడు మరింత ఫర్ ఫెక్టు గా ఉంది. అరచేతికి బట్ట చుట్టి, ఆ చేతితో చిన్నసైజు కత్తి పట్టి, రక్తసిక్తమైన ఫ్యాంట్ వేసుకుని నడుస్తూ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు తారక్.

ఇక హారిక హాసిని క్రియేషన్స్ బేనర్ మీద తివిక్రం మిత్రుడు ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నాడు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది!!