Home రాజకీయాలు బాబును గిల్లి.. జోలపాడిన జేసీ!

బాబును గిల్లి.. జోలపాడిన జేసీ!

SHARE

చంద్రబాబు నేడు అధికారంలో ఉండటానికి గల కారణాలు రెండే రెండు అని ఏపీలో ఎవరిని అడిగినా చెప్పే విషయాలు! అందులో ఒకటి నాటి పరిస్థితుల్లో మోడీ మేనియా కాగా మరొకటి.. గోదావరి, కోస్తా జిల్లాల్లో పవన్ మేనియా అని! ఆ సంగతులు, గతం మరిచిన బాబు.. నేడు మిడిసిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడిచిన కొంత కాలంగా… బీజేపీ తనను మోసం చేసిందని బాబు అండ్ కో హడావిడి చేస్తుండగా… బాబు అవినీతి పీక్స్ కి వెల్లిందని పవన్ చెప్పుకొస్తున్న పరిస్థితి. దీంతో… ఎవరికి వారు విడిపోయి, ఎవరి కుంపటి వారు పెట్టుకున్న పరిస్థితి. ఈ పరిస్థితితుల్లో కేంద్రంలో మోడీ రాక ఇక జరగరాదని, మోడీ ప్రధాని అవ్వడం దేశానికి చెడు అని బాబు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో, కోరుకుంటున్న పరిస్థితుల్లో.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బాబుకు ఏమాత్రం నచ్చని జోస్యం చెప్పుకొచ్చారు.

అవును… టీడీపీ నేతల్లో తనదైన వాక్ చాతుర్యం కలిగిన జేసీ దివాకర్ రెడ్డి తాజాగా బాబుకు ఏమాత్రం నచ్చని ఒక జోస్యం చెప్పుకొచ్చారు. వాటిలో రెండు చాలా కీలక అంశాలు.. బాబుకు ఏమాత్రం నచ్చని మాటలు. వాటిలో ఒకటి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని కాగా.. మరొకటి కేంద్రంలో బీజేపీ గెలుస్తుందని. బాబు కోరుకునే కోరికల్లో అత్యంత ప్రధానమైనవి, పెద్దవి అయిన ఈ కోరికలku పూర్తి వ్యతిరేకంగా జేసీ జోస్యం చెప్పారు. తాను అధికారంలోకి రాకపోయినా పర్లేదు కాని… ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకూడదనేది బాబు కోరిక!! కాగ… జేసీ ఈ విషయంలో చిన్న పాటి జోస్యం చెప్పి బాబును గిల్లారని అనుకోవచ్చు!!

అయితే… దీనికి కారణం జేసీ మనస్థాపమే అనేది కొందరి వాదనగా ఉంది. జేసీ ఆర్థికబలాన్ని, అంగబలాన్ని టీడీపీ బాగా వాడుకుంది, వాడుకుంటుంది కానీ.. జిల్లా టీడీపీ వ్యవహారాల్లో కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ జేసీ మాట ఏదీచెల్లడం లేదనే గట్టిగా వినిపిస్తోన్న మాట. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే.. అనంతపురం ఎంపీ సీటును దివాకర్ రెడ్డి త్యాగం చేస్తూ కొడుకుకు ఇస్తుండగా… ప్రభాకర్‌ రెడ్డి కూడా తప్పుకుని తన కొడుకుకు ఛాన్స్‌ ఇస్తున్నాడట. ఈ రెండు సీట్లూ ఓకే కాని.. జేసీ జాబితాలో మరో మూడు నాలుగు సీట్లున్నాయి. వాటిల్లో పోటీ చేయడానికి అని ఒక జాబితాను జేసీ ఫ్యామిలీ సిద్ధం చేస్తోండగా.. అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే సీటు తప్ప మరేదీ జేసీ సోదరులు చెప్పినట్టుగా జరగదు అనే మాటలు తాజాగా టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాబును గిల్లడానికి చెప్పారా లేక వాస్తవాలు తెలిసి చెప్పారో కానీ… బాబుకు ఏమాత్రం నచ్చని జోస్యం చెప్పి మరీ గిల్లారు జేసీ!

ఇక్కడ మరో విషయం ఏమిటంటే… గుడ్డిలో మెల్లలాగ, గిల్లి జోలపాడినట్లుగా, రాబోయే ఎన్నికల్లో ఏపీలో మాత్రం టీడీపీ నే అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు జేసీ! జేసీ వేసిన జోస్యం హాస్యం.. బాబు దగ్గర ఎలాంటి రియాక్షన్ ను ఇస్తుందో వేచి చూడాలి మరి!!