Home రాజకీయాలు బాబు తెలివి… విధ్వంసాలతో దూరం అంట!

బాబు తెలివి… విధ్వంసాలతో దూరం అంట!

80
SHARE

ఎలా ఉందనే విషయం అందరికీ తెలిసిన సంగతే! మునుపెన్నడూ రాని రేంజ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంగా నేటి టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు చెబుతున్నాయనే కాకుండా కాగ్ కూడా తన నివేదికలో ఇదే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసింది! ఇక గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన హామీలు, ఇచ్చిన వాగ్ధానాల సంగతి సరే సరి. అవన్నీ ఎప్పుడో చెత్తబుట్టల్లో పారేసిన పరిస్థితి! ఇదే క్రమంలో ప్రత్యేక హోదా విషయంలో ఆ నేరం మొత్తం బీజేపీతో పాటు టీడీపీకే ప్రధానంగా చుట్టుకున్న సంగతి. దీంతో బాబు కొత్త ఎత్తులు వేస్తున్నారు.

జనాలు చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారని, అద్భుతమైన పాలన సాగుతుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అద్భుతమైన అనుబందం ఉందనే రేంజ్ లో మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఇంత మంచి ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య గ్యాప్ తీసుకురావాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయనేది బాబు తాజా ఆరోపణ. వినేవాడు ఆంధ్రుడైతే చెప్పేవాడు చంద్రబాబు అన్న రేంజ్ లో ఉన్న ఈ పరిస్థితికి కారణం తనదైన శైలిలో చెప్పుకొస్తున్నారు చంద్రబాబు!

“కొద్ది రోజుల క్రితం గుంటూరులో పనిగట్టుకుని విధ్వంసం సృష్టించారు.. ఒక చిన్నారిపై జరిగిన అఘాయత్యాన్ని అడ్డంపెట్టుకొని విధ్వంసానికి ప్రణాళిక రచించారు.. ఇటువంటి మరో పది కుట్రలకు పథక రచన చేస్తున్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పడం ద్వారా మన ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు.. ఇటువంటి కుట్రలతో ప్రభుత్వంపైనా, టీడీపీపైనా చెడు అభిప్రాయం కలిగించి మనం చేసిన మంచి పనులపై నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని అనుకుంటున్నారు..” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీశ్రేణులకు చెప్పుకొస్తున్నారు.

అసలు ఏపీ ప్రభుత్వం చేసిన మంచి పనులేంటి అనేది బాబు ఇక్కడ స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పలువురి అభిప్రాయం. నిజంగా విధ్వంశాలు సృష్టించాలని చూస్తున్నారు అని బాబు చెబుతుంటే.. అది కచ్చితంగా ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమనే చెప్పాలి. ఇదే క్రమంలో సరిగ్గా ఆలోచిస్తే.. బాబు తెలివి ఇక్కడ బయటపడుతుంది. కేవలం విధ్వంశాలు చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ సృష్టించాలని పలువురు భావిస్తున్నారు… లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య చాలా కమ్యునికేషన్ ఉందనేది బాబు అతి తెలివి వాదన. కానీ బాబు గ్రహించాల్సింది ఏమిటంటే… ఈ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వసనీయత లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దానికి బాబు చేజేతులా చేసిన కొన్ని కార్యక్రమాలను ఉదహరిస్తున్నారు.

ఏది ఏమైనా… బాబు తెగ ఫీలయిపోతున్నట్లుగా.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ తీసుకురావడానికి కొత్తగా విధ్యంశాలు సృష్టించాల్సిన పనిలేదని, ఇప్పటికే బాబు పాలన పుణ్యమాని, జరుగుతున్న అవినీతి పుణ్యమా అని ఆ గ్యాప్ పూడ్చలేనంత దూరంగా ఉందని బాబు గమనించాలి!!