Home రాజకీయాలు బాబు మాటలు వినిపించాయా పవన్!

బాబు మాటలు వినిపించాయా పవన్!

84
SHARE

2014 ఎన్నికల సమయంలో ఎంత రాసుకు పూసుకు తిరిగారో.. తాజా పరిణామాల అనంతరం అంత బద్ద శతృవులు అయిపోయారు జనసేన అధినేత పవన్ – ఏపీ సీఎం చంద్రబాబు! వేదికనెక్కి మైకందుకున్న ప్రతిసారి లోకేష్ అవినీతిపైనా, బాబు పాలనలో యదేచ్చగా సాగుతున్న అవినీతిపైనా పవన్ ఫైరవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కు కౌంటర్ ఇచ్చే పనికి పూనుకున్నారు బాబు!

ఏపీలో అవినీతి పీక్స్ కి వెళ్లిపోయింది.. సీఎం కుమారుడు లోకేష్ బాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు.. బరితెగించిన అవినీతి ఏపీలో జరుగుతుంది.. ఇసుక, మట్టి నుంచి మొదలు కాదేదీ అవినీతికి అనర్హం అన్న రేంజ్ లో బాబు పాలన సాగుతుంది అని పవన్ కళ్యాణ్ విమర్శల వర్షాలు కురిపించిన సంగతి మరిచిపోలేనిది. అదే కామెంట్స్ పై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వద్ద లోకేష్ అవినీతికి సంబందించి సాక్ష్యాలు కూడా ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పవన్ చెప్పిన సరైన సమయం వచ్చినట్లే అని అంటున్నారు విశ్లేషకులు.

తాజాగా మాట్లాడిన చంద్రబాబు… ఏపీలో అవినీతి రహిత పాలన సాగుతుందని, కావాలని ఎవరైనా బురదజల్లితే, అశాంతిని రేపితే ఊరుకునేది లేదని తనదైన శైలిలో కాస్త గట్టిగానే చెప్పారు. ఏపీలో అవినీతి ఇసుక నుంచి మొదలు అన్నింట్లోనూ ఉందని చెబుతున్నారు.. అదంతా అవాస్తవం. తన పాలన చాలా పారదర్శకంగా జరుగుతుంది, టెక్నాలజీని వాడుతున్నాం, ముందుకు పోతున్నాం అని బాబు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పవన్ తన వద్ద ఉన్నాయని చెబుతున్న సాక్ష్యాలేమిటో ఈ బస్సు యాత్ర పేరుచెప్పైనా బయట పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పవన్ చెప్పినట్లుగా లోకేష్ అవినీతికి సంబందించి తన వద్ద సాక్ష్యాలు ఉంటే మాత్రం.. అవి బయటపెట్టడానికి, ప్రజల ముందు ఉంచడానికి ఇంతకుమించిన సందర్భం మరొకటి ఉండదనేది పలువురి అభిప్రాయంగా ఉంది. మరి ఈ అభిప్రాయాలను, బాబు పాటలను పరిగణలోకి తీసుకుని పవన్ ఆ విషయాలేమిటో బయట పెడతారా లేక మౌనంగానే ఉండిపోతారా అనేది వేచి చూడాలి!!