Home సినిమా గోపిచంద్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్కశెట్టి

గోపిచంద్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్కశెట్టి

SHARE

బాహుబలి తర్వాత అనుష్కశెట్టి కేవలం భాగమతిలోనే కనిపించింది. ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత పెద్దగా కొత్త సినిమాలకు ఒకే చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా గోపిచంద్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆచిత్రానికి నా నువ్వే ఫేమ్ జయేంద్ర దర్శకత్వం వహించనున్నారు.

గోపిచంద్ తాజా చిత్రం షూటింగ్ ముగియగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత ఈ జోడి నటించేందుకు సిద్ధమైంది అని చిత్ర యూనిట్‌కు చెందిన వారు వెల్లడించారు.