Home సినిమా రంగస్థలం తిరుగులేని 50 రోజులు..

రంగస్థలం తిరుగులేని 50 రోజులు..

82
SHARE

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్ర ఘనవిజయంలో మరో మైలురాయి అధికమించింది. నేటితో రంగస్థలం చిత్రం 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఒకప్పుడు అయితే సినిమా ఎన్ని రోజులు ఆడింది అని మాట్లాడుకునే వారు.. కానీ ఇప్పుడు చిత్రాల విడుదల శైలిలో చాలా మార్పులు వచ్చాయి. అత్యధిక థియేటర్ లలో విడుదలవుతుండడం వలన ఓ చిత్రం రెండు వారాలు ఆడితే గొప్పగా చెప్పుకుంటున్నారు. తొలి వారంలోనే చిత్రాలు 80 శాతం వసూళ్లు రాబడుతున్నాయి. దీనితో ఎంత వసూలు చేసింది అని మాత్రమే మాట్లాడుకుంటున్నారు. రంగస్థలం చిత్రం ఆ రెండు ఘనతలని దక్కించుకుంది.

మార్చి 30 న వేసవి కానుకగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకుని ప్రభంజనం సృష్టించింది. పల్లెటూరు కథ, స్థానికంగా జరిగే రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కి ఇప్పటికి ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. రంగస్థలం చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. రంగస్థలం చిత్ర యూనిట్ కు ఇది గర్వపడే రోజు అని చెప్పవచ్చు.