Home రాజకీయాలు బాబుకు దడ పుట్టిస్తున్న పశ్చిమ స్పందన!

బాబుకు దడ పుట్టిస్తున్న పశ్చిమ స్పందన!

69
SHARE

ప్రస్తుతం పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్.. రోజు రోజుకీ ప్రజలకు అత్యంత దగ్గరైపోతున్నారనడంలో సందేహం లేదు. జగన్ మొత్తం పాదయాత్రను చూసుకుంటే మిగిలిన ప్రాంతాల సంగతి కాసేపు పక్కన పెట్టి.. విజయవాడ విషయానికొస్తే.. ఆ సంఘటన బాబుకు కలిగించిన భయం అంతా ఇంతా కాదనేది జగమెరిగిన సత్యం! విజయవాడలో జగన్ కు ప్రజలు పలికిన నీరాజనాలు, కలిపిన అడుగులూ అన్నీ ఇన్నీ కాదు. దుర్గమ్మ సాక్షిగా బెజవాడ మొత్తం జగన్ వెంటనడిచిందనే చెప్పుకోవాలి! ఈ క్రమంలో అనంతరం బాబుకు అత్యంత టెన్షన్ పెడుతున్నవి గోదావరి జిల్లాలు.

అవును.. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది! గోదావరి జిల్లాల్లోకి ఎంటరైన జగన్ కు జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం.. జగన్ కు గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక్క సీటు కూడా రాలేదు. పవన్ నాటి సందడే కారణమో లేక స్థానిక పరిస్థితుల ప్రభావమో కానీ.. పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా కు చేదుజ్ఞాపకాన్నే మిగిల్చింది. అయితే అది గతం.. ప్రస్తుతం జగన్ పాదయాత్రకు వస్తున్న జనాలు.. రాబోయే రోజుల్లో వారి తీర్పు ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న పాదయాత్ర ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ పవనాలు మారుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, చెబుతున్న మాటలు, చేస్తున్న చేతలు ప్రజల్లో పలు రకాల సందేహాలకు తావిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేస్తున్న బాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే చెప్పాలి! దానికి సజీవ సాక్ష్యమే.. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని వైకాపా అధినేతను నేడు జనాలు పడుతున్న నీరాజనాలు!

దీంతో టీడీపీ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా అయిపోయిందనే వార్తలొస్తున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ధేశించడంలో గోదావరి జిల్లాల పాత్ర ఎప్పుడూ కీలకమే. ఈ క్రమంలో పశ్చిమలో జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన, జనాలతో జగన్ మమేకమై చెబుతున్న మాటలు, ఇస్తున్న వరాలు.. బాబుకు దడ పుట్టిస్తున్నాయని అంటున్నారు కొందరు తమ్ముళ్లు. ఈ జిల్లాలో జగన్ యాత్ర సాగే తీరుతెన్నులపై చంద్రబాబుకు సమాచారం అందించడానికి ఏర్పాటుచేసుకున్నారని చెబుతున్న నిఘావర్గాలు కూడా జగన్ పాదయాత్రకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే విషయాన్ని చెబుతున్నాయట!! దీంతో బాబుకు దడ రోజు రోజుకీ పెరిగిపోతుందని అంటున్నారు!!