Home రాజకీయాలు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్!

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్!

SHARE

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు జెట్ వేగంతో మారుతున్నాయి. మెజారిటీకి కూతవేటు దూరంలో ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ ఆగిపోవడంతో, కాంగ్రెస్ జేడీఎస్‌ల మైత్రి మొదలైంది. బీజేపీని ఎట్టి పరిస్థితులలో గద్దెనెక్కనివ్వమని రెండు పార్టీలూ ప్రకటించేశాయి.

కాంగ్రెస్, జేడీఎస్‌ల సీట్ల సంఖ్యను కలిపితే మ్యాజిక్ ఫిగర్‌ రీచ్ అవ్వటంతో అసలు కదా మొదలైంది. తాము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కాంగ్రెస్ మరియూ జెడీఎస్ లు అధికారాన్ని అందుకునే అవకాశాలు ఉండటంతో బీజేపీ అలర్ట్ అయ్యింది.

ఇక ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ తన విచక్షణాధికార౦ ద్వారా ఎవరినైనా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చు. బీజేపీకి అవకాశం ఇవ్వవచ్చు, కూటమిగా వస్తామంటున్న కాంగ్రెస్ -జేడీఎస్‌లకు కూడా అవకాశం ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలో గవర్నర్ బీజేపీ తరఫు మొగ్గు చూపుతారని అంతటా టాక్.

మరో వైపు రేపే యడ్యూరప్ప ప్రమాణస్వీకారం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారట. ముహూర్తం ఖరారు అయ్యిందని కూడా వార్త రేపు మధ్యాహ్నం 12.20కి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ౦ చేయబోతున్నట్టు సమాచారం.