Home రాజకీయాలు బాబుకు ఇక నిద్రలేని రాత్రులు!

బాబుకు ఇక నిద్రలేని రాత్రులు!

65
SHARE

చాలా మంది ఊహించినట్లుగానే జరిగింది.. టీడీపీ నేతలు బయపడినట్లుగానే ఫలితాలు వచ్చాయి.. బీజేపీ నేతలు చెప్పినట్లుగానే కమలం వికశించింది.. ఫలితంగా చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వచ్చింది! ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ చూసిన వారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్స్ ఇవి! కర్ణాటకలో బీజేపీ గెలిస్తే.. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా ఫీలవుతున్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది కచ్చితంగా టీడీపీ అనే చెప్పాలి. దానికి కారణాలు ఇప్పుడు చుద్దాం.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న యాంటీ మోడీ స్టాండ్ తో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కొచ్చని ప్లాన్స్ వేశారు. దానికి మరింత బలం చేకూరాలంటే.. కర్ణాటకలో బీజేపీకి డిపాజిట్లు పోవాలని ఆశించారు.. తన వారితో కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. ప్రచారాలు అయ్యాయి.. ఎన్నికలు అయ్యాయి.. ఫలితాలు వచ్చేశాయి. దీంతో ఏపీలో టీడీపీ నేతలు టెన్షన్ తో బీపీలు పెంచేసుకుంటున్నారట.

‘కర్నాటక ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఏపీ సంగతి చూస్తారు’ అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు గతంలో చేసిన ప్రకటన దీనికి ప్రధాన కారణం! తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారం ఇప్పటికే కాకమీద ఉండగా.. ఏపీలో బాబు అండ్ కో చేసిన అవినీతిపై బీజేపీ గుర్రుగా ఉందని, నేరం తమపై వేస్తున్నారని.. ఈ విషయంలో బాబు సంగతి చూడాలని ఏపీ బీజేపీ నేతలు ఫుల్ గా కోరుకుంటున్న పరిస్థితి. దీనికి మరింత బలం చేకూరుస్తూ… తాజాగా వెలువడిన ఫలితాల అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ట్విట్టర్ లో స్పందించారు.

రాం మాధవ్ ట్విట్టర్ లో తన గెలుపు ఆనందాన్ని వ్యక్తపరచడం కంటే… తమ గెలుపును చూపించి బాబుకు పరోక్ష హెచ్చరికలు కూడా జారీచేసే పనికి పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాల్ని, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు.. బీజేపీకి ఓటు వేయొద్దంటూ బాబు ప్రచారం చేసినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచింది.. బాబు మాటల్ని తెలుగు వారు నమ్మలేదు.. అని వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటక గెలుపు బాబుపై పరోక్ష గెలుపు అనే స్థాయిలో బీజేపీ ఆలోచించుకుంటుందని అనుకోవచ్చు!!

ఈ ఎన్నికల ఫలితాల అనంతరం తమ కాన్సంట్రేషన్ మొత్తం ఏపీపైనే అనే స్థాయిలో బీజేపీ జాతీయ నాయకులు కొందరు వ్యాఖ్యానించడం, ఇటు కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం అంతా హుటాహుటున జరిగిపోతున్న సంగతి తెలిసిందే! దీంతో తాజా పరిణామాలు, కర్ణాటకలో ప్రభుత్వం ఫాం చేయడం అనంతరం బాబుపై బీజేపీ దృష్టి సారించొచ్చని తెలుస్తుంది!!