Home సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్

సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్

64
SHARE

సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో బంగార్రాజు పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు నాగార్జున. ఈ సినిమాకు బంగార్రాజు పాత్ర హైలెట్ గా నిలిచింది. నాగార్జున కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం ఇది. తాజాగా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు బంగార్రాజు పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల నేలటికెట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నేలటికెట్ సినిమా. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాకు దర్శకత్వం వహిస్తాడని.. జూన్ 25న ప్రారంభిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన స్క్రిప్ట్‌వర్క్ ప్రారంభించినట్లుగా తెలిసింది.

నాగార్జున తాజాగా నటించిన చిత్రం ఆఫీసర్ మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆఫీసర్ సినిమా తరువాత నాగార్జున చెయ్యబోయే సినిమా బంగార్రాజు అని సమాచారం. ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.