Home ట్రైలర్స్ రేస్ 3.. అదిరిపోయిందిగా!!

రేస్ 3.. అదిరిపోయిందిగా!!

SHARE

బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ కూడా రెడీగా చేస్తుండాల్సిందే. ధూమ్ – రేస్ చిత్రాలను బాలీవుడ్ అభిమానులు ఎంతలా ఆదరించారో తెలిసిందే. మన సౌత్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాలు బ్రహ్మా౦డ౦గా చూస్తారు.

ఈ ధూమ్ రేస్ లకు కొనసాగి౦పు సీక్వెల్స్ కూడా వస్తూనే ఉన్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సల్మాన్ రేస్ 3 రెడీ ఔతోంది. ఈ చిత్ర యూనిట్ ఈ రోజు ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో వుండి సినిమా పై అంచనాలు పెంచింది. దర్శకుడు రేమో డి సౌజా సినిమా తెరకెక్కించిన విధానం ఎంతో కొత్తగా అద్భుతంగా వుంది. ట్రైలెర్ ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమాలో యాక్షన్ పార్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని చెప్పవచ్చు. విలన్ గా అనిల్ కపూర్ పాత్ర ఏ స్థాయిలో ఉందో ట్రైలర్ చెప్తుంది. బాబీ డియోల్ – జక్వాలిన్.. డైసీ షా ఈ సినిమాలో పాత్రలు చేశారు.

సల్మాన్ ఖాన్ మాస్ లుక్ తో పాటు స్టయిలిష్ లుక్ కి మాస్ ఫిదా అవ్వటం ఖాయ౦. ఇక ఇది ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని డైలాగ్స్ బట్టి అర్ధమవుతోంది. మూడు నిమిషాల నిడివి వున్నా ఏ మాత్రం బోర్ కొట్టకుండా వుండేల కట్ చేశారు. ముందు రెండు సిరీస్ ల కన్నా ఎంతో కొత్తగా ఉందనిపిస్తోంది. ఈ చిత్రం జూన్ 15న రిలీజ్ కాబోతోంది.

ట్రైలర్ పై ఓ లుక్ ఏసుకోండి..