Home వీడియోలు మతిపోగుడుతున్న తమన్నా సెక్సీ స్టెప్పులు.

మతిపోగుడుతున్న తమన్నా సెక్సీ స్టెప్పులు.

108
SHARE

ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నాకు, ఫ్రెంచ్ డీజే అయిన డీజే స్నేక్ మధ్య సోషల్ మీడియాలో సంభాషణ జరిగింది. స్నేక్ మాట్లాడుతూ బాహుబలి చిత్రాన్ని చూశానని తమన్నా ఫెర్ఫామెన్స్ బావుందని అన్నారు. తమన్నా కూడా స్నేక్ కు బదులిచ్చింది. ఇటీవల స్నేక్ ఆల్బమ్ నుంచి విడుదలైన మాగంట రిథమ్ సాంగ్ తనకు చాలా బాగా నచ్చిందని తమన్నా తెలిపింది. దీనికి డాన్స్ చేయగలవా అంటూ స్నేక్ ఛాలెంజ్ విసిరాడు.

డీజే స్నేక్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన తమన్నా తన సెక్సీ స్టెప్పులతో డాన్స్ అదరగొట్టేసింది. సాంగ్ కు తగ్గట్లుగా హుషారుగా అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించింది.

గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేసింది. స్వింగ్ జర అనే ఈ సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో తమన్నా అందాల ఆరబోత, రెచ్చిపోయి డాన్స్ చేసిన విధానం యువత మతి పోగొట్టేలా చేసింది.

మాగంట రిథమ్ సాంగ్ కు తమన్నా చేసిన డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లని కుదిపేస్తోంది . తనలో ఎంతటి డాన్స్ ప్రతిభ దాగివుందో ఈ వీడియో ద్వారా తమన్నా నిరూపించింది.