Home రాజకీయాలు కర్ణాటక ఎన్నికల ఫలితాలు హంగ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు?

కర్ణాటక ఎన్నికల ఫలితాలు హంగ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు?

74
SHARE

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 113ను ఏ పార్టీ అందుకోలేకపోవడంతో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్‌ రెండో స్థానానికే పరిమితం అయింది.

బీజేపీ 104 స్థానాల్లో గెలిస్తే, కాంగ్రెస్‌ 78 స్థానాలకే పరిమితం అయ్యింది. జేడీఎస్‌కి 37 సీట్లు దక్కాయి. అనుకున్నట్టు జేడీఎస్ కీలకంగా మారింది..  జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తాము ఆ పార్టీకి మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ సై అంది. కుమారస్వామిని సీఎం పీఠం ఎక్కించాలని, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం, స్పీకర్ ఇవ్వాలని ఇరు పార్టీలు తీర్మానించాయి.

మరోవైపు బీజేపీ కూడా పట్టుదలతోనే ఉంది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఉన్న అన్ని దారులను అన్వేషిస్తోంది. జేడీఎస్‌లో ఒక వర్గం ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపునకు తిప్పుకున్నట్లు సమాచారం.

ఇన్ని పరిణామాల నేపథ్యంలో కన్నడనాట ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ఆ రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.