Home రాజకీయాలు కన్నా కెరీర్ కు ప్లస్సా మైనస్సా!

కన్నా కెరీర్ కు ప్లస్సా మైనస్సా!

70
SHARE

కన్నా లక్ష్మీనారాయణ… గత కొన్ని రోజులుగా ఏ పార్టీలోకి వెళ్తారు అనే విషయంపై తెగ గాసిప్స్ నడిచాయి. ఈ క్రమంలో కన్నా వైకాపాలో చేరబోతున్నారని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ విషయం దాదాపు కంఫాం అయిపోయిందని కూడా కన్నా ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. అయితే అదంతా గతం.. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఈ నిర్ణయం పట్ల కన్నా కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తున్న సమయంలో.. అసలు ఈ పదవి వరించడం వల్ల కన్నా కెరీర్ కు పెద్ద నష్టమే అనేది రాజకీయ విశ్లేషకుల మాట!

అవును… అంతా ఊహించినట్లుగా కన్నా వైకాపా లో చేరి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు వేరేగా ఉండేది. కానీ ఉన్నపలంగా అంత కీలక బాధ్యత నెత్తిన పడేసరికి కక్క లేక మింగలేక ఉండాల్సిన పరిస్థితి. పిలిచి పదవి ఇచ్చినప్పుడు కాదనేలి పరిస్థితి.. అది ముల్ల కిరీటం అనే విషయం గుర్తొచ్చే సరికి అంతలోనే అసంతృప్తి. దానికి రెండు కారణాలు ఉన్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అంతకంటే గొప్పగా ఏమీ లేదనే చెప్పాలి. వారు మునిగిపోతూ పోతూ టీడీపీని కూడా దాదాపు పీకల్లోతులో ముంచేశారనే టాక్ నడుస్తుంది. దీనికి చంద్రబాబు ఆలోచనా విధానమే కారణమనే విశ్లేషణ కూడా ఉంది.. అది ప్రస్తుతానికి అప్రస్తుతం. దీంతో.. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్తుతం వైకాపా కు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తున్న తరుణంలో అలాంటి పార్టీవైపు చూడకుండా.. మునిగిపోతున్న నావకు కెప్టెన్ అవ్వడం కచ్చితంగా కన్నా కెరీర్ కు పెద్ద దెబ్బ కాక మరేమిటి?!

ప్రస్తుతం ఏపీలో బీజేపీ ఉన్న పరిస్థితిలో ప్రజల మద్దతు కూడగట్టడం అంత చీన విషయమేమీ కాదు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పీఠం ఎక్కడం వల్ల ఏపీకి ప్రత్యేక హోదా వచ్చింది అనే రాజకీయ చేసినా కూడా… ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఆ క్రెడిట్ కచ్చితంగా జగన్ కే వెళ్తుంది. ఈ క్రమంలో బీజేపీ ఊపిరి పీల్చుకోవడానికి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అయితే… గుజరాత్ ఎన్నికల ఫలితాల అనంతరం బాబు సంగతి బీజేపీ చూస్తుంది అని కథనాలు వస్తున్న తరుణంలో.. తర్వాతి స్థానం కోసం బీజేపీ పోటీపడుతుందని మాత్రమే ప్రస్తుతానికి ఒక క్లారిటీకి రావాల్సిన పరిస్థితి! ఈ క్రమంలో ఈ పోస్టులో కూర్చోవడం కన్నాకు కచ్చితంగా కత్తిమీద సామే అని చెప్పక తప్పదు!!