Home రాజకీయాలు జేడీ… మరో పవనా?

జేడీ… మరో పవనా?

1082
SHARE

ఊహించని రీతిలో సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్యులే కానీ, ఆయన మాటల్లో జాగ్రత్త కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అనుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న జేడీ మాటలు 2014 ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ మాటల్లా అనిపిస్తున్నాయనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. దీంతో జేడీ.. మరో పవన్ అవబోతున్నారా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.

విషయంలోకి వస్తే… భిన్నమైన రాజకీయాల కోసం, సమాజ అభివృద్ది కోసం, సమకాలీన రాజకీయాల్లో మార్పుకోసం తాను రాజకీయాల్లోకి వస్తున్నాను అని గతంలో చెప్పుకొచ్చారు పవన్ కల్యాన్. ఆ క్రమంలో సీనియారిటీ అనే పదాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబుకు మద్దతిచ్చారు.. ఫలితంగా ఎంతో కొంత సాయంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అనంతర కాలంలో చంద్రబాబు పాలనలో అవినీతి విచ్చలవిడిగా తయారయ్యిందని, స్వయంగా సీఎం కొడుకు లోకేషే అవినీతిలో చెలరేగిపోతున్నారని.. చెప్పుకొచ్చారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకు ఐదేళ్లు నరకం తప్పదని పవన్ కు తెలియదో ఏమో!

అనంతరం పవన్ సొంతంగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు.. టీడీపీని తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. గతంలో పవన్ మాట విని ఓట్లేసిన వారి సంగతి ఏమిటిరా బాబు అంటే… ఆటలో అరిటిపండే! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా లక్ష్మీనారాయణ లైన్ లోకి వచ్చారు. సమాజం కోసం తాను తన ఉద్యోగానికి రాజినామా చేశానని, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్తానని చెప్పుకొస్తున్నారు. ఎలా ముందుకు వెళ్తారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినా.. “ఆ విధంగా” ముందుకెళ్తానని మాత్రం చెప్పుకొచ్చారు.

ఈ విషయాలన్నీ పరిశీలించిన సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాత్రం… రెండు మూడు నెలల తర్వాత జేడీ సొంత పార్టీ పెట్టబోతున్నారు జనసేన లాగా.. ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు పలకబోతున్నారు అని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇలాంటి కబుర్లే చెప్పిన పవన్.. బాబు పంచన చేరి ఇప్పుడు సొంత కుంపటిపై ఒంటరిగా రెడీ అయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజా విశ్లేషణల ప్రకారాం జేడీ లక్ష్మీనారాయణ కూడా బాబు తానులో ముక్కే అనే కామెంట్స్ వ్యక్తపరుస్తున్నారు!! అయితే… బాబు పాలన బాగాలేదు, అవినీతి పెరిగిపోయింది, మార్పు అవసరం అని లక్ష్మీనారాయణ రంగంలోకి దిగితే క్రెడిబిలిటీ ఉంటుంది కానీ… పాలన బాగుంది, అభివృద్ధి పోటీపడి మరీ జరుగుతుంది అని చెబుతూ.. అన్నీ అర్ధం చేసుకుని రంగంలోకి దిగుతాయని చెప్పడంపై మాత్రం.. జేడీ 2019 కి మరో పవన్ కళ్యాణ్ అవబోతున్నారు అనే క్లారిటీకి వచ్చేస్తున్నారు జనాలు!!